Viral Video: ఓ వైపు అభిషేక్, ఐశ్యర్య విడాకులంటూ పుకార్లు.. మరోవైపు ఫ్యామిలీ ఫంక్షన్లో జంటగా ప్రత్యక్షం.. వైరల్ అవుతోన్న వీడియో..
ఓ వైపు బాలీవుడ్ లో మరొక జంట విడాకులు అంటూ గత కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు. ఈ పుకార్లపై ఇరు కుటుంబ సభ్యులు అవును అనలేదు.. కాదు అంటూ ఖండించలేదు. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు ఒక పెళ్లి వేడుకలో కలిసి కనిపించారు. ఈ సమయంలో వీరిద్దరూ కలిసి పోజులిచ్చారు. ఈ జంట ఫోటోలు, వీడియోలు బాగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో యూజర్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. చాలా కాలంగా ఈ జంట మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అందుకనే విడివిడిగా ఉంటున్నారు అంటూ గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో అభిమానులు వీరుద్దరూ కలిసి ఉంటే బాగుండును అని కోరుకున్నారు. అయితే తాజాగా అభిమానులను సంతోషపరిచే ఒక సంఘటన జరిగింది. విడాకుల పుకార్ల మధ్య అభిషేక్, ఐశ్వర్యలు ఒక వివాహం వేడుకలో కలిసి కనిపించారు.
ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ల వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హెడ్ లైన్లలో నిలిచాయి. ఈ వీడియోలో ఈ జంట కలిసి కనిపించింది. అభిషేక్, ఐశ్వర్యల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా ఇందులో ఉంది. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలను చూసిన తర్వాత.. అభిమానులు వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది విడాకులు అంటూ వస్తున్న వార్తలపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. మరికొందరు బచ్చన్ కుటుంబాన్ని ఉత్తమ కుటుంబం అని పిలుస్తున్నారు.
అభిషేక్-ఐశ్వర్య ఎవరి వివాహానికి హాజరయ్యారంటే
View this post on Instagram
ఐశ్వర్య రాయ్ కజిన్ శ్లోకా శెట్టి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం పూణేలో జరిగింది. ఈ పెళ్ళికి ఐశ్వర్య, అభిషేక్ తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఐశ్వర్య , అభిషేక్ లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. అభిషేక్ పింక్ కలర్ హూడీ ధరించి ఉండగా, ఐశ్వర్య నల్లటి డ్రెస్ లో ఉంది. ఆరాధ్య ముందు వరుసలో నిలబడి ఉంది. మరో ఫోటోలో, ఐశ్వర్య గులాబీ రంగు దుస్తులు ధరించి అతిథితో సెల్ఫీ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
వైరల్ వీడియోలో కలిసి పోజులిచ్చాడు
ఈ వివాహం వేడుకకు సంబంధించిన ఒక వీడియో కూడా బయటపడింది, దీనిలో ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య వధూవరులతో కలిసి ఒకే వేదికపై కనిపిస్తున్నారు. ముగ్గురూ కెమెరా వైపు చూస్తూ పోజులిస్తున్నారు. అయితే, చాలా మంది అభిమానులు ఐశ్వర్య, అభిషేక్ కలిసి కనిపించినప్పటికీ, వారి మధ్య ఇంకా విభేదాలు ఉన్నాయని.. ఈ జంట సంబంధం బాగా సాగడం లేదంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
వీడియో చూసిన ఒక వినియోగదారు ” వీరి మధ్య కెమిస్ట్రీ లేదు, నకిలీ చిరునవ్వు” అని రాశారు. మరొకరు “భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని తను అనుకోవడం లేదని.. తండ్రీ కూతుళ్ల మధ్య కూడా మాటలు లేవని.. ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ జంటపై తమకు ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం ఒకేచోట ఉండడం.. వీరు ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..