AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌… సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు

బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన చిత్రాలైన సికందర్, జాట్ చిత్రాల ట్రైలర్లలో తెలుగు నేపథ్యం, సంస్కృతి బాగా కనిపిస్తున్నాయి. కథా నేపథ్యం ఉత్తర భారతదేశంలో ఉండటం, కానీ కొన్ని సన్నివేశాలను కేరళలో చిత్రీకరించడం ద్వారా సౌత్ ఫ్లేవర్ జోడించే ప్రయత్నం చేశారు. అయితే, బేబీ జాన్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి చిత్రాలలో ఈ ఫార్ములా పెద్దగా పనిచేయలేదు. అయినప్పటికీ, దర్శకులు ఇప్పటికీ ఉత్తర భారత సినిమాల్లో తెలుగు అంశాలను కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Bollywood: నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
South Cinema Vs Bollywood
Satish Reddy Jadda
| Edited By: |

Updated on: Apr 01, 2025 | 3:05 PM

Share

కొద్ది రోజులుగా బాలీవుడ్ పరిస్థితి అస్సలు బాలేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయటం లేదు. ఒకటి రెండు సినిమాలు వర్కవుట్ అయినా… ఇండస్ట్రీ ఫేట్ మార్చే రేంజ్‌ లో లేదు సక్సెస్‌ సౌండ్‌. అందుకే ప్రజెంట్ ఇండియన్‌ స్క్రీన్‌ ను రూల్‌ చేస్తున్న సౌత్ ఫ్లేవర్‌ ను నమ్ముకుంటున్నారు నార్త్ స్టార్స్‌. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలతో పాటు అప్‌ కమింగ్ సినిమాల్లో సౌత్ టచ్‌ ఉండేలా చూసుకుంటున్నారు.

రీసెంట్‌ గా రిలీజ్ అయిన సికందర్ టీజర్‌ లో సౌత్ ఫ్లేవర్‌ గట్టిగా కనిపించింది. సినిమా కథ నేపథ్యం నార్త్ బ్యాక్‌ డ్రాపే అయినా… కొన్ని సీన్స్‌ కేరళ లో ప్లాన్ చేశారు దర్శకుడు మురుగదాస్. ఆ సీన్స్‌ లోనే హీరోయిన్‌ కాజల్‌ కూడా కనిపించనుంది. దర్శకుడు సౌత్‌ నుంచి వెళ్లిన వాడు కావటంతో ఇక్కడి నేటివిటిని బాలీవుడ్‌ కు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌ గా బ్లెండ్ చేశారు.

జాట్ ట్రైలర్‌ లోను సౌత్‌ ఫ్లేవర్‌ బాగా కనిపించింది. ఈ సినిమా కథ సౌత్‌ లోనే, అది కూడా తెలుగు స్టేట్స్‌ లోనే జరుగుతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌. విలన్‌ రణతుంగ సామ్రాజం తెలుగు రాష్ట్రాల్లోని ఓ తీర ప్రాంత గ్రామమని ట్రైలర్‌లో కన్ఫార్మ్ చేశారు. ఓ షాట్‌ లో లేడీ పోలీస్‌ ఆఫీసర్ మాట్లాడుతుండగా వెనుక తెలుగు నేమ్ బోర్డ్‌ ను చూపించారు. సో… తెలుగు నేల మీద జరిగే ఓ అన్యాయాన్ని నార్త్‌ నుంచి వచ్చిన హీరో ఎలా అడ్డుకున్నాడన్నదే ఈ సినిమా కథ. అదే విషయంలో మరింత క్లారిటీ ఇచ్చేలా నా పంచ్‌ పవర్‌ నార్త్ అంతా చూసింది… ఇప్పుడు సౌత్ చూస్తుంది అనే డైలాగ్‌ను ట్రైలర్‌ లోనే యాడ్ చేశారు.

అయితే నార్త్ సినిమాలో సౌత్‌ ఫ్లేవర్‌ అనేది అంత సక్సెస్‌ ఫుల్ ఫార్ములా ఏం కాదు. వరుణ్ ధావన్‌ హీరోగా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాలో కథలో కొంత భాగాన్ని కేరళ బ్యాక్‌ డ్రాప్‌ లో ప్లాన్ చేశారు. అయితే ఆ సీన్స్‌ బాగానే వర్కవుట్ అయినా.. సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్‌ కాలేదు. సల్మాన్‌ ప్రీవియస్ మూవీ కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ లోనూ కొంత కథ తెలంగాణలో జరుగుతున్నట్టుగా చూపించారు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలా పెద్దగా సక్సెస్‌ రేటు లేకపోయినా… నార్త్ సినిమాల్లో సౌత్‌ మిక్చర్ కలిపేందుకు దర్శకులు మాత్రం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి అప్‌ కమింగ్ సినిమాల్లో అయినా ఈ ఫార్ములా కాసులు కురిపిస్తుందేమో చూడాలి.

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్