AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది.. ఏ విధంగా పెన్ను పట్టుకుంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే..

మనిషి శారీరక తీరు మాత్రమే కాదు కళ్ళు, ముక్కు, చెవులు కూడా ఒకొక్కరికి ఒకొక్క రకంగా ఉంటాయి. అదే విధంగా తినడం, త్రాగడం, నడవడం లేదా కూర్చోవడం కూడా వ్యక్తి.. వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఒకొక్కరు చేసే పనిలో ఒకొక్క శైలి ఉంటుంది. అదే విధంగా ఒకొక్కరు ఒకొక్కలా పెన్ను పట్టుకుని వస్తారు. వ్రాసే విధానంలో కూడా తేడా ఉంటుంది. అయితే ఇలా పెన్ను పట్టుకుని వ్రాసే విధానం.. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. కనుక ఈ రోజు పెన్ను పట్టుకున్న విధానం ద్వారా ఎవరికీ తెలియని వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

Personality Test: పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది.. ఏ విధంగా పెన్ను పట్టుకుంటే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే..
Personality Test
Surya Kala
|

Updated on: Mar 31, 2025 | 5:40 PM

Share

గత కొంత కాలంగా వ్యక్తిత్వ సంబంధిత పరీక్షల గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. మన గురించి మనం మాత్రమే కాదు.. ఇతరుల గురించి కూడా తెలుసుకోవాలనే గుణం సహజంగానే అందరిలో ఉంటుంది, కనుక ఈ వ్యక్తిత్వ పరీక్షలు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, నుదురు ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వ లక్షణాలను నిర్ణయించవచ్చు. అదే విధంగా మీరు పెన్ను పట్టుకునే విధానం కూడా మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. అవును, మీరు ఎవరికైనా పెన్ను ఇస్తే.. ఆ వ్యక్తి దానిని తనదైన శైలిలో పట్టుకుంటాడు. కొంతమంది పెన్నును రెండు వేళ్లతో పట్టుకుంటారు, మరికొందరు పెన్నును పూర్తి ఒత్తిడిని ఉపయోగించి ప్రయోగిస్తారు. కనుక పెన్ను ఎలా పట్టుకుంటారో గమనించండి.. నిజమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి..

బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలు మధ్య పెన్ను పట్టుకునే శైలి: బొటనవేలు, చూపుడు వేలు ,మధ్య వేలు మధ్య పెన్ను పట్టుకునే వ్యక్తులు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు కొన్ని విషయాలు , వ్యక్తుల గురించి విమర్శనాత్మకంగా ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు చాలా దయగలవారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి తప్పులు చేయడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా తప్పులు జరిగితే.. వాటిని వీరు విశ్లేషించి తీర్మానాలు చేస్తారు. పరిస్థితిని బట్టి.. భావోద్వేగపరంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు.

చూపుడు, మధ్య వేళ్ల మధ్య పెన్ను పట్టుకునే శైలి: ఇలా పెన్నుని పట్టుకునే వ్యక్తులు తమని తాము ఎక్కువగా ఇష్టపడతారు. చూపుడు, మధ్య వేళ్ల మధ్య పెన్ను పట్టుకుని వ్రాసే వ్యక్తులు తమ జీవితాన్ని పూర్తి స్థాయిలో గడపడానికి ఇష్టపడతారు. వీరు తమకు ప్రియమైనవారు చేసిన తప్పులను గుర్తుపెట్టుకోరు. వీరికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. తమకు ఎదురయ్యే ప్రతికూల విషయాలకు దూరంగా ఉంటారు, ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా గాసిప్స్ మాట్లాడడానికి ఇష్టపడరు. వీరు తమని ప్రతి ఒక్కరూ తమను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. తనని గౌరవంగా చూసుకున్నవారిని ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

బొటనవేలుకి ఒత్తిడి ఇచ్చే విధంగా పెన్ను పట్టుకుంటే: కొంతమంది పెన్నుని బొటన వేలుకి తీవ్ర ఒత్తిడి కలిగే విధంగా పట్టుకుంటారు. ఈ విధంగా పెన్ను పట్టుకునే వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు భావోద్వేగాల ప్రభావానికి లోనవుతారు. కనుక వీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. వీరికి మితిమీరిన ఆలోచనలు, భావాలు ఉంటాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఎదురైతే ఎక్కువ ఆందోళన చెందుతారు. వీరు తమకు సహాయం చేసిన వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోరు. చిన్న చిన్న విషయాలకే సులభంగా బాధపడతారు. నమ్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కనుక ఇటువంటి వ్యక్తులు స్నేహితులు, కుటుంబ సభ్యులకు చాలా అవసరం.

చూపుడు వేలు, బొటనవేలు మధ్య పెన్ను పట్టుకునే శైలి: ఈ విధంగా పెన్ను పట్టుకునే వ్యక్తులు మర్మమైన వ్యక్తులు. వీరు చేసే పనిని బయటకు చెప్పరు. వీరు అంతర్ముఖులు. అందరినీ నిశితంగా గమనిస్తారు అందరినీ నిశితంగా గమనిస్తారు. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఆసక్తి ఉంటుంది. వీరు తమ భావోద్వేగాలను చూపించడానికి ఇష్టపడరు. తమకు ఎంత గాయం అయినా సరే మౌనంగా ఉంటారు. వీరి మితిమీరిన ఉత్సాహం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)