అఘోరి వశపరుచుకుంది..బీటెక్ యువతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో
తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ గురించి తెలియని వారు ఉండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బిటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరీగా మారటానికి ఇంటిలో నుంచి వెళ్ళిపోవడం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజ్ లో బిటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత కొద్దీ రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరీ బస చేసింది. ఆ క్రమంలో అఘోరికీ, యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రెండు రోజుల క్రితం మేజర్ అయిన యువతి తాను అఘోరీగా మారటానికి సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకుముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్ళిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులుకు చెప్పారు. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతూరిని ఆఘోరి వశపరుచుకుందని ఆరోపించారు. అఘోరి చెర నుంచి తమ కూతురును విడిపించి తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు
మరిన్ని వీడియోల కోసం :
ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో
గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి..హమాస్ నేత మృతి
బంగారాన్ని ఎక్కువ కాలం వాడకపోతే తుప్పు పడుతుందా?