31 March 2025

6 నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్‏గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. 

ఈ అమ్మడు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. 

ఇదిలా ఉంటే.. గతేడాది అక్టోబర్ నెలలో రకుల్ ప్రీత్ సింగ్ గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్‏లో వర్కవుట్ చేస్తున్న టైంలో గాయపడింది. 

అయితే 6 నెలలు గడిచినప్పటికీ ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. ఆ గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పిందన్నారు రకుల్. 

జిమ్ లో తనకు తగిలిన గాయం ఎదురుదెబ్బ అని.. ఇప్పటికీ సరైన స్థితిలోకి రాలేదని.. అప్పటికంటే కాస్త మెరుగుపడినట్లు చెప్పుకొచ్చింది. 

చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ .. అన్ని అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి అచితూచి అడుగులు వేయాలి. 

గాయన్ని మొదట తాను నిర్లక్ష్యం చేశానని.. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికే దాని తీవ్రత మరింత ఎక్కవైందని తెలిపింది. 

గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమయ్యిందని. ధైర్యంగా ఆ గాయం నుంచి కోలుకుంటున్నానని తెలిపింది.