Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devaragattu: దేవరగట్టు కర్ర సమరానికి సర్వ సిద్ధం.. అర్ధరాత్రి స్వామివారి కళ్యాణం.. భారీగా బందోబస్తు

అర్దరాత్రి మాల మల్లేశ్వర కళ్యణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరంలో ఇతర గ్రామల నుండి వచ్చిన వారు మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొన్ని పల్లకి లో ఉన్న స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తాకేందుకు రావడంతో వారిని నియమ నిష్ఠలతో ఉన్న మూడు గ్రామాల భక్తులు వారిని పల్లకి దగ్గరకు రాకుండా నివారించే ప్రయత్నం లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు లో జరిగే కర్రల సమరం కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. 

Devaragattu: దేవరగట్టు కర్ర సమరానికి సర్వ సిద్ధం.. అర్ధరాత్రి స్వామివారి కళ్యాణం.. భారీగా బందోబస్తు
Devaragattu Karrala Samaram
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Oct 24, 2023 | 2:28 PM

కర్రల సమరానికి దేవరగట్టు సిద్దమైంది. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవాలుకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేటగ్రామాల భక్తులు దీక్ష లు చేపడతారు. విజయదశమి రోజు ఆర్దరాత్రి జరిగే కర్రల సమరానికి..  ఈ రోజు ఉదయం గంగిపూజ పంచామృత అభిషేకం, హారతి హోమం, రుద్రాభిషేకాలను అర్చకులు నిర్వహించారు. పూజ కార్యక్రమాలకు హాజరైన భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం క్షేత్ర సంప్రదాయం ప్రకారం స్వామి వార్లకు మరో మారు పూజలను చేయనున్నారు. అర్ధరాత్రి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

అర్దరాత్రి మాల మల్లేశ్వర కళ్యణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరంలో ఇతర గ్రామల నుండి వచ్చిన వారు మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొన్ని పల్లకి లో ఉన్న స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తాకేందుకు రావడంతో వారిని నియమ నిష్ఠలతో ఉన్న మూడు గ్రామాల భక్తులు వారిని పల్లకి దగ్గరకు రాకుండా నివారించే ప్రయత్నం లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు లో జరిగే కర్రల సమరం కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.  ప్రభుత్వం ఈ  ఉత్సవాల ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సుమారు 2000 వేల మంది పోలీసులు మోహరించారు. పోలీసుల తో పాటు 100 మంది రెవెన్యూ 100 మంది విద్యుత్ శాఖ సిబ్బంది 100 మందు వైద్య ఆరోగ్య సిబ్బంది వారి తో పాటు గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది కూడా విధులు నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఈ ఉత్సవాల్లో గాయపడే భక్తుల చికిత్స కోసం 100 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఇతర ప్రాంతాలకు చేర్చేందుకు అంబులెన్స్ ను సిద్ధం చేశారు. ]

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..