Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్నవారు ఎంత సంపాదించినా పేదవారీగా జీవిస్తారంటున్న ఆచార్య చాణక్య

తమ ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా డబ్బులను కోల్పోవడం జరుగుతుంది. చాణక్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అటువంటి వారి గురించి వర్ణించాడు. తన నీతి శాస్త్రంలో డబ్బులను సంపాదించినా.. కొంతమంది తమ అలవాట్లతో ఆ డబ్బుని పోగొట్టుకుంటారని.. అలాంటి చెడు అలవాట్లు వదులుకోవాలని సూచించాడు. ఈ రోజు డబ్బుల సంపాదన కోసం మనిషి వదులు కోవాల్సిన చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం.. 

Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్నవారు ఎంత సంపాదించినా పేదవారీగా జీవిస్తారంటున్న  ఆచార్య చాణక్య
Chanakya Motivational Quotes
Follow us
Surya Kala

|

Updated on: Oct 19, 2023 | 1:04 PM

ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జీవితం సుఖ సంతోషాలతో గడవం కోసం డబ్బు సంపాదించడానికి మనుషులు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. మరికొందరు అడ్డదారిలో సంపాదించడం,  మాయలు చేసి సంపాదించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే తప్పుడు అలవాట్ల వల్ల డబ్బు సంపాదించడంలో పూర్తిగా విఫలమవుతున్న వారు కూడా ఉన్నారు. తమ ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా డబ్బులను కోల్పోవడం జరుగుతుంది. చాణక్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అటువంటి వారి గురించి వర్ణించాడు. తన నీతి శాస్త్రంలో డబ్బులను సంపాదించినా.. కొంతమంది తమ అలవాట్లతో ఆ డబ్బుని పోగొట్టుకుంటారని.. అలాంటి చెడు అలవాట్లు వదులుకోవాలని సూచించాడు. ఈ రోజు డబ్బుల సంపాదన కోసం మనిషి వదులు కోవాల్సిన చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం..

ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండండి

తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఇతరుల ప్రభావానికి లోనైన వ్యక్తి ఎవరి మాట వినడు, ఇతరుల ప్రభావానికి లోనైన వీరు తమ జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ఈ ఇబ్బందులు ఏ రకంగానైనా ఉండవచ్చు.

వృధా ఖర్చుల నివారణ

చాణక్యుడు ప్రకారం డబ్బును అనవసరంగా ఖర్చు చేసేవారు.. ఎప్పుడైనా కష్టం వస్తే.. ఆదుకునే వీలుగా డబ్బులను పొదుపు చేయని వ్యక్తి తన జీవితాంతం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నాడు. కనుక అధికంగా ఖర్చుపెట్టే స్వభావాన్ని అదుపులో ఉంచుకోమని సూచించాడు.

ఇవి కూడా చదవండి

దురాశ ఉండే వ్యక్తులకు

కొందరు తమ అవసరం తీర్చుకోవడానికి చాలా మధురంగా మాట్లాడుతూ తమ పథకంలో చిక్కునే విధంగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మాటలను నమ్మితే.. భవిష్యత్తులో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల దురాశతో మధురంగా మాట్లాడే వ్యక్తుల ట్రాప్ లో పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.  ఎందుకంటే ఇలాంటి నిర్ణయం మీ జీవితాన్ని పాడుచేయవచ్చు.

సోమరితనాన్ని వదులుకోండి:

మీరు జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని మీరు కోరుకుంటే .. మీరు  సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే సోమరితనం ఉన్న వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు.

ఎవరైనా ఇక్కడ ఇచ్చిన చెడు అలవాట్లను వదులుకుంటే.. అటువంటి వారు తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు అనేక ఇతర సమస్యలను నివారించడంలో కూడా మీకు సహాయపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.