- Telugu News Photo Gallery Navratri Celebrations 2023: Bagalkote Jagadamba Gets Over 8 Lakh Currencies Decorated
Navratri 2023: అమ్మవారిపై తమ భక్తిని భిన్నంగా చాటుకున్న భక్తులు.. నోట్లతోనే మండపం అలంకారం..
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భక్తులు వీధి వీధిలో మండపాలను ఏర్పాటు చేసి దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారిని రోజుకో ఒక్క రూపంలో అలంకరిస్తూ.. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో పూజిస్తున్నారు. అయితే కొన్ని మండపాల్లోని అమ్మవారి అలంకారాన్నీ మండపాలను డిఫరెంట్ గా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
Updated on: Oct 19, 2023 | 12:24 PM

కర్ణాటక లోని బాగల్‌కోట్ జిల్లా గుళేదగూడ పట్టణంలోని జగదాంబ దేవి ఆలయ గర్భగుడిని నగదుతో అలంకరించారు. ఇలా ఆలయాన్ని అందంగా అలంకరించడం కోసం 8 లక్షలకు పైగా విలువైన కరెన్సీని ఉపయోగించి కలర్ పుల్ గా అలంకరించారు. పువ్వులుగా పువ్వుల దండలుగా 20, 50, 100, 200, 500 నోట్లను అలంకరణకు వినియోగించి రెడీ చేసారు. నవరాత్రుల కోసం ప్రత్యేకంగా డబ్బులతో చేసిన అలంకరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దేశవ్యాప్తంగా నవరాత్రులను జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రకరకాల మండపాలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుళేదగూడ పట్టణంలోని అమ్మవారి గర్భాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు పువ్వులను లేదా ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించలేదు.

పట్టణంలోని జగదాంబ దేవి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా జగదాంబ దేవి గర్భాలయాన్ని నోట్లతో అలంకరించారు. ఈ అలంకారం కోసం వివిధ రంగుల నోట్లను వినియోగించారు. 20,50,100,200,500 నోట్లను అలంకరణకు ఉపయోగించి ఆ నోట్లతోనే పువ్వులను రెడీ చేశారు. వికసించినట్లు కనిపిస్తున్న ఈ పువ్వుల చిత్రాలు, దండలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

జగదాంబ దేవిని డబ్బుతో అలంకరించేందుకు భక్తులు తమ శక్తి మేరకు డబ్బులు ఇచ్చారు. ఈ సొమ్ముకు ట్రస్టు సొమ్ము మరింత జత చేసి.. అమ్మవారిని అలంకరించి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.

అమ్మవారి ఆలయాన్ని నోట్లతో అలంకరించేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అలంకరణకు సుమారు ఎనిమిదిన్నర లక్షల విలువైన నోట్లను వినియోగించినట్లు తెలుస్తోంది. నోట్ల అలంకారం ద్వారా భక్తులు తమకు అమ్మవారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు.





























