టీవీఎస్ రేడియాన్.. దీనిలో ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనిలో గడియారం, సర్వీస్ ఇండికేటర్, తక్కువ బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్ , యావరేజ్ స్పీడ్ వంటి సమాచారాన్నిచూపిస్తుంది. ఈ బైక్ ఇంటెల్లిగో సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇది ఎక్కువసేపు పనిలేకుండా ఉన్నప్పుడు సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఈ బైక్ లో 109.7సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. 7,000 ఆర్పీఎం వద్ద 8 బీహెచ్పీ. 5,000 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ కు 65-70 మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ బేస్ ఎడిషన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 60,925, డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 74 834, డిజి డిస్క్ వేరియంట్ రూ. 78 834. (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.