- Telugu News Photo Gallery Cricket photos ICC World Cup 2023: These 3 Bangladesh Players Might Be Danger For Team India And Rohit Sharma
IND Vs BAN: రోహిత్‌ను భయపెడుతోన్న ఆ ముగ్గురు.. తక్కువగా అంచనా వేస్తే నాగిని డ్యాన్సే.!
వన్డే ప్రపంచకప్ 2023 మంచి రంజుగా సాగుతోంది. తొలి వారంలో అన్నీ వన్‌సైడ్ మ్యాచ్‌లే జరగ్గా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘన్ జట్టు ఓడించడం.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించడంతో.. టోర్నమెంట్ ముందుకు సాగే కొద్ది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మెగా టోర్నీలో జోరు మీదున్న టీమిండియా.. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది.
Updated on: Oct 19, 2023 | 11:44 AM

వన్డే ప్రపంచకప్ 2023 మంచి రంజుగా సాగుతోంది. తొలి వారంలో అన్నీ వన్‌సైడ్ మ్యాచ్‌లే జరగ్గా.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘన్ జట్టు ఓడించడం.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ మట్టికరిపించడంతో.. టోర్నమెంట్ ముందుకు సాగే కొద్ది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మెగా టోర్నీలో జోరు మీదున్న టీమిండియా.. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది. పూణేలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. రోహిత్‌ను ముగ్గురు బంగ్లాదేశ్ క్రికెటర్ల రికార్డులు ఒకింత భయపెడుతున్నాయ్. వారిని తక్కువ అంచనా వేస్తే నాగిని డ్యాన్స్ తప్పేలా కనిపించట్లేదు.

గత మ్యాచ్‌లు పరిశీలిస్తే.. టీమిండియా(1)పై బంగ్లాదేశ్(3)దే పైచేయిగా ఉంది. అయితే ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా దూకుడు మీదుంది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించి.. నాలుగో విజయం అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయలేం. భారత్‌ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే వస్తోంది.

బంగ్లాదేశ్‌లోని ఓ ముగ్గురు ప్లేయర్స్.. మ్యాచ్‌ను ఈజీగా మలుపు తిప్పేయగలరు. వారికి టీమిండియాపై అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. మరి వాళ్లెవరో కాదు.. షకిబుల్ హాసన్, మెహిదీ హాసన్ మిరాజ్, లిటన్ దాస్.

మెహిదీ హాసన్ మిరాజ్.. ప్రతీసారి భారత్‌పై అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చాడు. టీమిండియాతో గతేడాది జరిగిన ఓ మ్యాచ్‌లో మిరాజ్ సెంచరీ సాధించాడు. అందులో భారత్ ఓటమిపాలైంది.

షకిబుల్ హాసన్.. బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం.. గతంలో భారత్‌పై అదిరిపోయే ఇన్నింగ్స్‌లు, వికెట్లు తీసిన ఎక్స్‌పీరియన్స్ షకిబుల్ హాసన్ సొంతం.

ఇక లిటన్ దాస్.. తన దూకుడైన ఆటతీరుతో టీమిండియాను బెంబేలెత్తించవచ్చు. పవర్‌ప్లేలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం లిటన్ దాస్‌కు అలవాటు. దీంతో అతడ్ని ఎంత త్వరగా ఔట్ చేస్తే.. టీమిండియాకు అంత మంచిది.





























