- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli Fastest To Complete 26000 Runs In International Cricket break sachin record
Virat Kohli: విన్నింగ్ షాట్‌తో ఉత్కంఠ సెంచరీ.. సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ..
Virat Kohli Break Sachin Record: ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇచ్చిన 257 పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ సెంచరీతో 41.3 ఓవర్లలో టీమిండియా ఛేదించింది. దీంతో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వరుసగా 4 విజయాలను సొంతం చేసుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Updated on: Oct 19, 2023 | 10:32 PM

పూణెలోని ఎంసీఏ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఉత్కంఠ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ 4 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 103 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ సెంచరీతో కింగ్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 26000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 601 ఇన్నింగ్స్‌ల ద్వారా 26 వేల పరుగులు సాధించాడు.

ఇప్పుడు కింగ్ కోహ్లీ కేవలం 577 ఇన్నింగ్స్‌ల ద్వారా 26 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ సెంచరీతో 41.3 ఓవర్లలో టీమిండియా ఛేదించింది. దీంతో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.





























