- Telugu News Photo Gallery Cricket photos IND Vs BAN Rohit Sharma, Virat Kohli Surpass Brian Lara, AB De Villiers In Most Runs In The ODI World Cup History in telugu
IND vs BAN: రోహిత్-కోహ్లీ దెబ్బకు.. వన్డే ప్రపంచకప్‌లో లారా-డివిలియర్స్ రికార్డుకు బీటలు.. అదేంటంటే?
ICC ODI World Cup 2023, Rohit Sharma - Virat Kohli: 33 ఇన్నింగ్స్‌ల్లో 1225 పరుగులు చేసిన బ్రియాన్ లారా, 22 ఇన్నింగ్స్‌ల్లో 1207 పరుగులు చేసిన ఏబీ డివిలియర్స్ వరుసగా 6వ, 7వ స్థానాలకు పడిపోయారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఇప్పుడు ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు.
Updated on: Oct 19, 2023 | 10:47 PM

అక్టోబరు 19, గురువారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన నాలుగో ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 40 బంతుల్లో 48 పరుగులు చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో లారా, ఏబీ డివిలియర్స్‌లను వెనక్కి నెట్టి వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

2023 ఎడిషన్‌లో రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్‌లలో 1243 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. కానీ రోహిత్ ప్రపంచకప్‌లో ఐదో అర్ధ సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో వెనుదిరిగాడు.

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో తన 3వ సెంచరీని సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్, లారాలను అధిగమించాడు.

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 35 ఇన్నింగ్స్‌ల్లో 1532 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమారసంగక్కర 35 ఇన్నింగ్స్‌ల్లో 1532 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీమిండియా మాజీ, ప్రస్తుత కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇప్పుడు నాలుగు, ఐదు స్థానాల్లోకి ప్రవేశించారు.

వీరిద్దరి రాకతో 33 ఇన్నింగ్స్‌ల్లో 1225 పరుగులు చేసిన బ్రియాన్ లారా, 22 ఇన్నింగ్స్‌ల్లో 1207 పరుగులు చేసిన ఏబీ డివిలియర్స్ వరుసగా 6వ, 7వ స్థానాలకు పడిపోయారు.

వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఇప్పుడు ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు.





























