Israel Hamas War: ఇజ్రాయిల్ పర్యటనలో బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్.. ప్రధాని బెంజమిన్, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ తో భేటీ

బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఇజ్రాయిల్ సహా అనేక విస్తృత ప్రాంతంలో రెండు రోజుల పర్యటనను చేయనున్నారు. పర్యటన సందర్భంగా సునాక్ అనేక ఇతర ప్రాంతీయ రాజధానులకు వెళ్లే ముందు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశం కానున్నారు. సునాక్ గురువారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌కు చేరుకుని..

Israel Hamas War: ఇజ్రాయిల్ పర్యటనలో బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్.. ప్రధాని బెంజమిన్, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ తో భేటీ
Uk President Rishi Sunak
Follow us
Surya Kala

|

Updated on: Oct 19, 2023 | 9:55 AM

తమపై హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా మరో వైపు ఇజ్రాయిల్.. గాజాపై విరుచుకుపోయాడుతోంది. పరిష్టితి తీవ్రం అవుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈరోజు ఇజ్రాయెల్ చేరుకోనున్నారు. రిషి ఇతర ప్రాంతీయ రాజధానులను సందర్శించే ముందు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లను కలవనున్నారు. UK ప్రధాన మంత్రి పర్యటన గురించి రాయిటర్స్ నివేదించింది. ఇప్పటికే  అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ కూడా ఇజ్రాయిల్ చేరుకుని ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్‌ను కలిశారు.

గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో సుమారు 2800 మంది పాలస్తీనియన్లు మరణించారు. శిథిలాల కింద మరో 1200 మంది సమాధి అయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మంగళవారం అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడుకు ముందు ఉంది. పేలుడుకు గల కారణాలపై వివాదం కూడా మొదలైంది.

ఇవి కూడా చదవండి

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఇజ్రాయిల్‌కు వెళ్లి, ఇతర ప్రాంతీయ రాజధానులకు వెళ్లే ముందు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు , అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశమవుతారని UK ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.

ఇజ్రాయిల్‌ను సందర్శించనున్న బ్రిటన్ ప్రధాని రిషి

బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఇజ్రాయిల్ సహా అనేక విస్తృత ప్రాంతంలో రెండు రోజుల పర్యటనను చేయనున్నారు. పర్యటన సందర్భంగా సునాక్ అనేక ఇతర ప్రాంతీయ రాజధానులకు వెళ్లే ముందు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశం కానున్నారు. సునాక్ గురువారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌కు చేరుకుని ఇతర ప్రాంతీయ రాజధానులకు వెళ్లే ముందు ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారని  అతని కార్యాలయం బుధవారం ఒక ఇమెయిల్‌లో తెలిపింది.

నెతన్యాహును కలిసిన అమెరికా అధ్యక్షుడు బెడైన్

అంతకుముందు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి గాజా స్ట్రిప్‌కు 20 ట్రక్కుల సహాయాన్ని పంపడానికి అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు బెడైన్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈజిప్టు నుండి దక్షిణ గాజాలోకి మానవతా సహాయం చేయడానికి అనుమతించదని చెప్పారు. అయితే ఆ సాయం హమాస్‌కు మళ్లించబడదని నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొంది.

ఇజ్రాయిల్‌కు కాంగ్రెస్ మద్దతు కోరనుంది

బుధవారం జర్మనీలో రీఫ్యూయలింగ్ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ వన్‌లో జో బెడైన్ విలేకరులతో మాట్లాడుతూ ఇజ్రాయిల్ పర్యటన తర్వాత ఫోన్ సంభాషణ సందర్భంగా సిసి తనకు ఈ హామీ ఇచ్చారని చెప్పారు. హమాస్‌ను అణిచివేసేందుకు సిద్ధమవుతున్న ఇజ్రాయిల్‌కు మద్దతు కోసం ఈ వారంలో సెనేట్ లో ప్రవస్తావిస్తానని గతంలో జో బెడైన్ చెప్పారు.

100 మిలియన్ డాలర్ల సహాయం

దీనితో పాటు జో బెడైన్ గాజా , వెస్ట్ బ్యాంక్ నివాసితులకు US మానవతా సహాయంగా $100 మిలియన్లను కూడా ప్రకటించారు. మంగళవారం రాత్రి గాజా సిటీ ఆసుపత్రిలో జరిగిన ఘోరమైన పేలుడుకు ఇజ్రాయెల్ బాధ్యత వహించదని పెంటగాన్ తనకు సాక్ష్యాలను చూపించిందని కూడా జో బెడైన్ చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..