Israel: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారతీయ యువతులు..! గుజరాత్‌నుంచి ఇజ్రాయెల్‌కు..
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వాయు, భూతల, జల మార్గాల్లో ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు భీకరదాడులు చేసి వందలాది మందిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో హమాస్ ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సైనికులను ఒక్కచోటికి చేర్చుతోంది.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వాయు, భూతల, జల మార్గాల్లో ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు భీకరదాడులు చేసి వందలాది మందిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో హమాస్ ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ సైనికులను ఒక్కచోటికి చేర్చుతోంది. ఈ క్రమంలో, హమాస్ పై దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ బలగాల్లో రియా ములియాసియా, నిషా ములియాసియా అనే ఇద్దరు ఇద్దరు భారత సంతతి అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరిద్దరి మూలాలు గుజరాత్ లో ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కిందట జీవాభాయ్ ములియాసియా, సవ్దాస్ భాయ్ ములియాసియా అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలోని కొఠాడి గ్రామంలో కిరాణా దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇజ్రాయెల్ పౌరసత్వం కూడా పొందారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయిలే రియా, నిషా. ఇజ్రాయెల్ లో ప్రతి ఒక్కరూ రెండేళ్ల నుంచి మూడేళ్ల పాటు సైన్యంలో సేవలు అందించాలన్నది అక్కడి రూల్. పురుషులు, మహిళలు అని తేడా లేకుండా 18 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరడం ఇజ్రాయెల్ లో తప్పనిసరి. దివ్యాంగులకు, మానసిక వైకల్యాలతో బాధపడేవారికి, కళాకారులకు, క్రీడాకారులకు ఇందులో మినహాయింపు ఉంటుంది. మినహాయింపు ప్రకారం క్రీడాకారులు, కళాకారులైన పురుషులు 2 సంవత్సరాల 8 నెలలు సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. మహిళా కళాకారులు, మహిళా క్రీడాకారులకు 75 శాతం మినహాయింపు ఉంటుంది. తప్పనిసరి సైనిక విధానంలో భాగంగానే రియా, నిషా తుపాకీలు చేతబట్టారు. ప్రస్తుతం కమాండో శిక్షణలో ఉన్న రియా కూడా హమాస్ పై పోరుకు సై అంటోంది. నిషా కమ్యూనికేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో సేవలందిస్తోంది. ఓ పదాతి దళానికి ఆమె ఇన్చార్జి కూడా. ఇజ్రాయెల్ కు ఉగ్రవాదుల పీడ విరగడ చేయడానికి తమ వంతు పోరాటం చేస్తామంటున్నారు రియా, నిషా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

