Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారిని హత్య చేసిన వృద్ధుడు

యుఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ప్లెయిన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో పాలస్తీనా- అమెరికన్ కు చెందిన వాడియా అల్-ఫయూమ్.. ఆమె తల్లిపై కత్తులతో దాడి చేశాడు. బాలుడు 26 సార్లు కత్తిపోట్లకు గురయ్యాడు. గాయాల కారణంగా చిన్నారి బాలుడు మరణించాడు. నిందితుడు వృద్ధుడు ఆ బాలుడి తల్లిపై కూడా పలుమార్లు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. 

Israel Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారిని హత్య చేసిన వృద్ధుడు
Israel Hamas War
Follow us
Surya Kala

|

Updated on: Oct 16, 2023 | 10:34 AM

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడు జోసెఫ్ ఎం కజుబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముస్లిం వ్యతిరేక మనస్తత్వం కారణంగానే ఆ వ్యక్తి చిన్నారిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

యుఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు ప్లెయిన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో పాలస్తీనా- అమెరికన్ కు చెందిన వాడియా అల్-ఫయూమ్.. ఆమె తల్లిపై కత్తులతో దాడి చేశాడు. బాలుడు 26 సార్లు కత్తిపోట్లకు గురయ్యాడు. గాయాల కారణంగా చిన్నారి బాలుడు మరణించాడు. నిందితుడు వృద్ధుడు ఆ బాలుడి తల్లిపై కూడా పలుమార్లు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.

అమెరికాలో పోలీసులు అప్రమత్తం

ఇజ్రాయెల్.. హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ముస్లిల ప్రతిస్పందన కారణంగా కొందరు  ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నారని సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఇటీవలి రోజుల్లో పెరిగిన సెమిటిక్ వ్యతిరేక , ఇస్లామోఫోబిక్ హింసలో భాగమని తెలిపారు. ద్వేషపూరిత నేరాలను ఎదుర్కోవడానికి అనేక అమెరికన్ నగరాల్లోని పోలీసులు సెమిటిక్ వ్యతిరేక లేదా ఇస్లామోఫోబిక్ భావాలచే ప్రేరేపించబడిన వారు హింసకు పాల్పడకుండా పోలీసులు ముందుగా అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో యూదులు, ముస్లింల మధ్య ప్రత్యేక యుద్ధం

సోషల్ మీడియాలో యూదు, ముస్లిం వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇరువర్గాల వారు ఒకరినొకరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కౌన్సిల్ ఆన్ అమెరికన్ – ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR), ముస్లిం పౌర హక్కుల సంస్థ ఈ సంఘటనను “ఒక పీడకల”గా అభివర్ణించింది. అమెరికాలోని ముస్లింల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్లామోఫోబిక్, ద్వేషపూరిత ప్రసంగాలను డాక్యుమెంట్ చేసే ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణ సమయంలో.. ద్వేషపూరిత కాల్‌లు, ఇమెయిల్ సందేశాల ఆర్కైవ్‌ను  సంస్థ సంకలనం చేసింది. బాలుడి మేనమామ యూసఫ్ హనాన్ చిన్నారి హత్యపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి హింసను ఎదుర్కొంటూ మానవత్వం చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..