Navaratri: నవరాత్రుల్లో రెండో రోజు.. బ్రహ్మచారిణిగా అమ్మవారు.. ఇలా పూజించండి ప్రతి కోరిక నెరవేరుతుంది

దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే బ్రహ్మచారిణిని నిర్మల హృదయంతో పూజిస్తారో అతని తపస్సు శక్తి పెరుగుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.

Navaratri: నవరాత్రుల్లో రెండో రోజు.. బ్రహ్మచారిణిగా అమ్మవారు.. ఇలా పూజించండి ప్రతి కోరిక నెరవేరుతుంది
Navaratri 2023
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2023 | 9:29 AM

హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నవరాత్రుల రెండవ రోజు. ఈ రోజు  దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజు బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల ఆమె అనుగ్రహం లభిస్తుందని.. అకాల మృత్యు భయం ఉండదని నమ్ముతారు. తల్లికి తీపి అంటే చాలా ఇష్టం. కనుక అమ్మవారికి చక్కర తో చేసిన పదర్ధాలతో పాటు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

బ్రహ్మచారిణి దేవి తెల్లటి చీర కట్టుకుని కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకుంటుంది. అమ్మవారి ఈ రూపాన్ని పూజించడం వల్ల శక్తి, త్యాగం, సంయమనం, పరిత్యాగం అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు. తల్లి బ్రహ్మచారిని తపశ్చారిణి, అపర్ణ, ఉమ, కన్యాకుమారి అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

వేల సంవత్సరాల కఠిన తపస్సు

దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. ఎవరైతే బ్రహ్మచారిణిని నిర్మల హృదయంతో పూజిస్తారో అతని తపస్సు శక్తి పెరుగుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.

నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

బ్రహ్మచారిణి తల్లిని ఇలా పూజించండి ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.  అనంతరం అమ్మవారిని పంచామృతంతో స్నానం చేయించి బ్రహ్మచారిణిగా అలంకరించాలి. అనంతరం అమ్మవారి ముందు దీపం వెలిగించండి.  తెల్లటి పువ్వును తీసుకొని బ్రహ్మచారిని ధ్యానం చేసి అమ్మవారికి సమర్పించండి. దీనితో పాటు అక్షతలు, కుంకుమ, పసుపు సమర్పించండి. ఈ రోజు అమ్మవారిని తెలుపు , సువాసనగల పువ్వులతో పూజించడం  శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ముఖ్యంగా ఈ రోజు పూజలో అమ్మవారికి తామర పువ్వును సమర్పించండి. అనంతరం అమ్మవారికి తమలపాకు తాంబూలం సమర్పించండి. అమ్మవారి ముందు మూడు సార్లు ప్రదక్షిణ చేసి తప్పులుంటే మన్నించమని కోరుకోండి. హారతిని ఇచ్చి ఏదైనా తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించమని కోరుకోండి. అమ్మవారిని ప్రార్ధించి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికి పంచండి.

ప్రార్ధనా శ్లోకము :

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.