Hastinapur: పాండవులు పూజించిన శివయ్య.. నేటికీ మహాభారత కాలం నాటి అవశేషాలు.. అద్భుత ఆలయం ఎక్కడుందంటే

పురాతన పాండవేశ్వర మహాదేవ ఆలయాన్ని పాండవులు నిర్మించారని, పాండవులు కూడా ఈ  పాండవేశ్వరాలయంలో పూజలు చేశారని చరిత్ర కథనం. ఈ ఆలయంలోని శివయ్య దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఆలయానికి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. భక్తులు హరిద్వార్ నుండి నీటిని తీసుకొని వచ్చి ఇక్కడ శివలింగాన్ని పూజించి జలాభిషేకాన్ని చేస్తారు.   

Hastinapur: పాండవులు పూజించిన శివయ్య.. నేటికీ మహాభారత కాలం నాటి అవశేషాలు.. అద్భుత ఆలయం ఎక్కడుందంటే
Pandeshwar Mahadev Mandir
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2023 | 1:27 PM

భారతదేశం సంప్రదాయానికి సంస్కృతికి మాత్రమే కాదు.. అతి పురాతన, ప్రత్యేకమైన హిందూ దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. దేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.  వీటిలో చాలా ఆలయాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర ఉంది. అలాంటి దేవాలయాలలో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని హస్తినాపూర్‌లో ఉంది. దీనిని పాండవేశ్వరాలయం అని పిలుస్తారు. ఇది మహాభారత కాలానికి సంబంధించినది.  పాండవులు ఇక్కడ పూజలు చేసేవారు. హస్తినాపూర్‌లో పురాతన పాండవేశ్వరాలయం, పాండవ తిల, కాళీమాత ఆలయం ఉన్నాయి. ఇక్కడ పాండవులు పూజించిన పవిత్రమైన శివలింగం ఉంది. నేటికీ, దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.

పాండవేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలి? దేశంలోని ఏ మూల నుండి అయినా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. ఘజియాబాద్ నుండి హస్తినాపూర్ వరకు దూరం దాదాపు 100 కి.మీ ఉంటుంది. రైలు ప్రయాణం ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాలంటే..  మీరట్ సమీపంలోని రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంది. మీరట్ నుండి AC, నాన్-AC బస్సులు హస్తినాపూర్‌కు వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక గంట ప్రయాణించి పాండవేశ్వరాలయం సమీపంలోని స్టాప్ వద్దకు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కాలినడకన ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

పాండవులు నిర్మించిన ఆలయం:

పురాతన పాండవేశ్వర మహాదేవ ఆలయాన్ని పాండవులు నిర్మించారని, పాండవులు కూడా ఈ  పాండవేశ్వరాలయంలో పూజలు చేశారని చరిత్ర కథనం. ఈ ఆలయంలోని శివయ్య దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఆలయానికి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. భక్తులు హరిద్వార్ నుండి నీటిని తీసుకొని వచ్చి ఇక్కడ శివలింగాన్ని పూజించి జలాభిషేకాన్ని చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆలయంలో ఒక పెద్ద మర్రి చెట్టు

పాండవేశ్వర మహాదేవ ఆలయ ప్రాంగణం లోపల వేల సంవత్సరాల నాటిదిగా భావించబడే భారీ మర్రి చెట్టు కూడా ఉంది. అందుకే ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు పురాతనమైన భారీ మర్రిచెట్టుకు కూడా నీళ్లు సమర్పిస్తారు.

ప్రస్తుతం మహాభారత కాలం నాటి అవశేషాలు

భారత పురావస్తు శాఖ వారు పాండవుల దిబ్బను త్రవ్వినప్పుడల్లా.. అక్కడ కొన్ని అవశేషాలు లేదా ఇతర వాటిని కనుగొంటునే ఉన్నారు. అయితే ఇక్కడ మరిన్ని తవ్వకాలు జరిపితే.. పాండవుల దిబ్బకు సంబంధించిన అసలు రూపాన్ని దెబ్బతీస్తుందని భారతీయ పురావస్తు శాఖ నమ్ముతున్నందున పాండవుల దిబ్బను త్రవ్వకాలను నిలిపేశారు. పాండవుల గుట్ట దగ్గర వర్షాకాలంలో చాలాసార్లు పాత నాణేలు దొరికాయని స్థానికులు చెబుతారు.

పాండవేశ్వరాలయానికి వెళ్తే తీసుకోవాలిన జాగ్రత్తలు

పాండవుల ఆలయాన్ని సందర్శించేందుకు ఎవరైనా వెళ్లాలనుకుంటే.. అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని.. కనుక కోతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. హస్తినాపూర్ వన్యప్రాణుల ప్రాంతం.  ఇక్కడ కోతులు మాత్రమే కాదు అనేక ఇతర జంతువులకు నెలవు. ఇక్కడ కోతులు ఎవరైనా ఆహార పదార్ధాలను తీసుకుని వెళ్తే.. వాటిని తీసుకోవడం కోసం దాడి చేసే అవకాశం ఉంది.  ఇక్కడ శివయ్యకు అభిషేకం చేసిన తర్వాత ఎవరికైనా మనశాంతి లభిస్తుందని.. ప్రశాంతంగా ఉంటారని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..