Bobbili Veena: బొబ్బిలి వీణలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కు నామినేట్ అయిన వీణలు

బొబ్బిలి లో తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మైసూర్, తంజావురు వీణలు మూడు చెక్కలతో తయారు చేస్తే బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఒకే ఒక చెక్కతో ఏకండి గా తయారు చేయడంలో సిద్ధహస్తులు. రాష్ట్రపతి భవన్ నుంచి వైట్ హౌస్ వరకు గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కు నామినేట్ అవ్వడంతో మరో సారి తన ఖ్యాతిని నిలబెట్టుకోగలిగింది.

Bobbili Veena: బొబ్బిలి వీణలకు మరో అరుదైన గుర్తింపు.. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కు నామినేట్ అయిన వీణలు
Bobbili Veena
Follow us
G Koteswara Rao

| Edited By: Surya Kala

Updated on: Oct 13, 2023 | 8:09 AM

తీగలు మీటితే సప్తస్వరాలు అందిస్తూ అందరి మనస్సులను అలరిస్తాయి వీణలు. ఆ సంగీతం వింటే చాలు మనస్సు మైమరచిపోతుంది. అంతటి వీణల తయారీకి ప్రసిద్ధి గాంచింది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గొల్లపల్లి వీణల తయారీకి కేంద్రం.. ఇక్కడ సంగీత అభిమానులను అలరించే సరస్వతీ వీణల నుండి చిన్నచిన్న బహుమతుల వీణల తయారీ వరకు ఓ ప్రత్యేకత కలిగింది. వీణల సంగీతం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కూడా ఆ చిన్నచిన్న వీణల జ్ఞాపికలే నేడు ప్రపంచ నలుమూలలకు సరఫరా అవుతున్నాయి. అంతేకాదు బొబ్బిలి చరిత్రను ఖండాంతరాల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి. తెలుగు వారికి, తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచాయి. సుస్వరాలు పండించే బొబ్బిలి వీణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

దేశ, విదేశాల్లో బొబ్బిలి వీణ రాగాలు విన్పిస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖుల కితాబులు పొందిన బొబ్బిలి వీణలకు ఎన్నో వేదికల పై అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలో ప్రతిష్ఠాత్మకమైన జి 20 సభ్యదేశాల సమావేశాల్లో సైతం బొబ్బిలి వీణ తన వైభవాన్ని చాటుకోనుంది. జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణలకున్న పేరు, ప్రఖ్యాతి మరే వీణలకు లేదనే చెప్పాలి. సుమారు మూడు వందల ఏళ్ల క్రితం బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరును సందర్శించిన సమయంలో అక్కడ రాజ దర్బారులో వీణా కచేరీని తిలకించారు. కళలలకు ప్రాణం పెట్టే బొబ్బిలి రాజులకు కచేరీలోని వీణా మాధుర్యంతో పాటు ఆ వీణలు తయారుచేసిన వడ్రంగుల నైపుణ్యం కూడా ఎంతో ఆకర్షించింది. వెనువెంటనే వాటిని బొబ్బిలిలో తయారు చేయించాలని నిర్ణయానికి వచ్చారు. వీణల తయారీలో మెలకువలు నేర్చుకోవాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించారు. అలా మైసూరులో మెలకువలు నేర్చుకున్న వడ్రంగుల వంశీయులు నేటికీ బొబ్బిలిలో వీణలు తయారుచేస్తున్నారు.

బొబ్బిలి లో తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మైసూర్, తంజావురు వీణలు మూడు చెక్కలతో తయారు చేస్తే బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఒకే ఒక చెక్కతో ఏకండి గా తయారు చేయడంలో సిద్ధహస్తులు. రాష్ట్రపతి భవన్ నుంచి వైట్ హౌస్ వరకు గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకు ఇప్పుడు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కు నామినేట్ అవ్వడంతో మరో సారి తన ఖ్యాతిని నిలబెట్టుకోగలిగింది.

ఈ సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా టీం వెరీఫికేషన్ కోసం బొబ్బిలి లోని గొల్లపల్లి గ్రామంలో పర్యటించారు టీమ్ సభ్యులు రవిన్ చరియన్, సమీర బృందం. బొబ్బిలి వీణల హస్త కళాకారులతో ముఖాముఖి చర్చించి వీణల తయారీతో పాటు వారి జీవన ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు బొబ్బిలి వీణల హస్త కళాకారులు.

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?