Andhra Pradesh: ‘ప్లీజ్ సారీ.. మరోసారి ఇలా జరగదు’.. మాజీ మంత్రికి సారీ చెప్పిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..
Ongole News: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్ బాబు సారీ చెప్పారు. మరి సారీ చెప్పేంత తప్పు ఏం చేశారు? అలాంటి పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది? కీలక వివరాలను తెలుసుకుందాం.. అధికారుల తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగింది. ‘ప్లీజ్ ఐయామ్ సారీ.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంతనూలపాడు

ఒంగోలు, అక్టోబర్ 13: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్ బాబు సారీ చెప్పారు. మరి సారీ చెప్పేంత తప్పు ఏం చేశారు? అలాంటి పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది? కీలక వివరాలను తెలుసుకుందాం.. అధికారుల తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగింది. ‘ప్లీజ్ ఐయామ్ సారీ.. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంతనూలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు క్షమపణలు చెప్పారు. మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ సమక్షంలో సభావేదికపై సారీ చెప్పారు. అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఎమ్మెల్యే. పద్ధతులు, సాంప్రదాయాలు తెలుసుకొని నడుచుకోవాలంటూ అధికారులను హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రొగ్రామ్‌కు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ ప్రొగ్రామ్‌కు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ఆహ్వానం ఇవ్వడంలో అధికారులు అలసత్వం వహించారని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌బాబు. ‘నాలుగైదు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మంత్రులు, పార్టీ పెద్దలు ఇలాంటి పొరపాట్లను గమనించాలి. చిన్న తప్పు కూడా జరగకుండా చూడాలి’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాలు ఇచ్చే క్రమంలో సరైన పద్ధతులు పాటించి ఉంటే ఈ కార్యక్రమం ఇంకా గొప్పగా జరిగి ఉండేదన్నారు. తనకు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డికి బాలినేని అండదండలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పారు సుధాకర్‌బాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




