Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysore Dussehra: దసరా సెలవులకు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. మైసూర్ బెస్ట్ ఎంపిక.. ఉత్సవాల గురించి ఫుల్ డీటైల్స్ మీకోసం..

దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ ప్యాలెస్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే..  మైసూరు సంప్రదాయ పాటలు, అంబా విలాస్ ప్యాలెస్ ముందు నృత్య ప్రదర్శనలు, జగన్ మోహన్ ప్యాలెస్‌లోని పెయింటింగ్ గ్యాలరీలు, లైవ్లీ యువ దసరా కార్యక్రమాలు, లేజర్-లైట్లతో సహా అంతులేని కార్యక్రమాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. 

Mysore Dussehra: దసరా సెలవులకు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. మైసూర్ బెస్ట్ ఎంపిక.. ఉత్సవాల గురించి ఫుల్ డీటైల్స్ మీకోసం..
Mysore Dussera
Follow us
Surya Kala

|

Updated on: Oct 13, 2023 | 1:33 PM

దసరా సెలవులు ఇచ్చేశారు.. సెలవులను ఎంజాయ్ చేస్తూనే పండగ జరుపుకోవాలనుకునేవారికి బెస్ట్ ఎంపిక  కర్ణాటకలోని మైసూరు. ఇక్కడ జరిగే దసరా వేడుకలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మైసూర్ ఎవరికైనా ఖచ్చితంగా విహారయాత్రలో హ్యాపీనెస్ ను అందిస్తుంది. మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు ప్రతి ఒక్కరికీ జీవితంలో మరపురాని అనుభవాన్నీ, ఉత్సాహాన్ని ఇస్తాయి. కనుక ఈ సెలవులకు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మైసూర్ కు మొదటి ప్రాధాన్యతను ఇవ్వండి.

దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ ప్యాలెస్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే..  మైసూరు సంప్రదాయ పాటలు, అంబా విలాస్ ప్యాలెస్ ముందు నృత్య ప్రదర్శనలు, జగన్ మోహన్ ప్యాలెస్‌లోని పెయింటింగ్ గ్యాలరీలు, లైవ్లీ యువ దసరా కార్యక్రమాలు, లేజర్-లైట్లతో సహా అంతులేని కార్యక్రమాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది.

అన్నింటికంటే మైసూర్ దసరా ఉత్సవాల్లో ఏనుగుల సవారీ వెరీ వెరీ స్పెషల్.. ప్రధాన ఏనుగుపై  చాముండేశ్వరి విగ్రహాన్నిఉంచి ఊరేగుతుంది. రాక్షస రాజు మహిషాసురుడి దుర్గా అవతారమైన చాముండేశ్వరి దేవి చేత వధింపబడ్డాడు. ఆ మహిషాసురుడి పేరు మీద మైసూరు నగరం ఏర్పడిందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మైసూరు దసరా ఎందుకు ప్రసిద్ధి చెందింది?

మైసూరు నగరంలో 10 రోజుల పాటు దసరా పండుగ జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరిగే ఈ వేడుకల్లో నగరం మొత్తం పాల్గొంటుంది. మైసూరు దసరా ఉత్సవాలు..  నవరాత్రులు మొదలై విజయదశమితో ముగుస్తాయి.

భారీఎత్తున జరుపుకునే దసరా వేడుకల కారణంగా దీనిని తరచుగా రాజ పండుగ అని పిలుస్తారు. నృత్యం, సంగీతం, ఊరేగింపు నుండి మైదానంలో ఎగ్జిబిషన్‌లు, ఫుడ్ స్టాల్స్ వరకు లేదా అందంగా అలంకరించబడిన మైసూర్ ప్యాలెస్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొత్తానికి ఈ నగరం ఈ 10 రోజుల్లో ఉల్లాసంగా, అందంగా మారుతుంది.

మైసూరు దసరా 2023లో ఎప్పుడు జరుపుతారంటే..

ఈ సంవత్సరం మైసూరు దసరా వేడుకలు అక్టోబర్ 15 ఉదయం 9 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 24 విజయదశమి రోజున ముగుస్తాయి.

మైసూరు చేరుకోవడం ఎలా?

మైసూరులో అద్భుతమైన రైల్వే, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. దీంతో పర్యాటకులు ఎక్కడ నుంచి అయినా మైసూర్ నగరానికి చేరుకుంటారు. ఆ ప్రదేశానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు నగరానికి నేరుగా విమానంలో వెళ్లలేకపోతే.. బెంగళూరుకు వెళ్లి అక్కడ నుంచి మైసూరుకు క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. బెంగళూరు నుండి మైసూరుకు 145 కిలోమీటర్లు మాత్రమే.. ఈ ప్రయాణించడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది.

ఎక్కడ బస చేయాలంటే

మైసూర్ దసరా చాలా వైభవంగా రాయల్టీతో జరుగుతాయి. కనుక ఈ సమయంలో నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక హోటళ్లు త్వరగా నిండిపోతాయి. కనుక మీరు కనుక ఈ వేడుకలను చూడాలనుకుంటే ముందుగానే హోటల్స్ ను బుక్ చేసుకోవడం బెస్ట్. గోకులం, అనేక ఆశ్రమాలతో కూడిన ప్రఖ్యాత యోగా హాట్‌స్పాట్, బస చేయడానికి ఒక ప్రత్యామ్నాయ నివాస సముదాయాలు

సమీపంలో సందర్సించాల్సిన ప్రదేశాలు

‘ప్యాలెస్‌ల నగరం’ అని కూడా పిలువబడే మైసూరు దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన నగరాలలో ఒకటి. పచ్చని అడవులు, చిన్న పట్టణాలు, అందమైన పచ్చికభూములతో పాటు అలనాటి రాజుల వైభవానికి సాక్షిగా నిలిచే రాయల్టీని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. వన్యప్రాణుల ప్రేమికులకు సంపదగా నిలిచిన రాష్ట్రం.

మైసూరు ప్యాలెస్ : ప్రతి సంవత్సరం 2.7 మిలియన్లకు పైగా పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.  ఈ ప్యాలెస్ భారతదేశంలోనే అతి పెద్ద ప్యాలెస్‌లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది పశ్చిమ కనుమల కొండలలో నెలకొని ఉంది. వడయార్ రాజవంశం కాలం నాటి అద్భుతమైన వాస్తు శిల్ప కళా నైపుణ్యం,  సంస్కృతిని ప్రదర్శించడానికి దసరా వేడుకల సందర్భంగా విలాసవంతంగా అలంకరించబడుతుంది.

బందీపూర్ నేషనల్ పార్క్ : బందీపూర్ 874 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఊటీ , మైసూరు మధ్య నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో నాగర్‌హోల్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్ , వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నాయి. మైసూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందీపూర్ నేషనల్ పార్క్ నిస్సందేహంగా వన్యప్రాణుల వీక్షణకు ఉత్తమమైన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి.

శ్రీరంగపట్నం: చారిత్రాత్మక పట్టణం శ్రీరంగపట్నం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. సాంస్కృతిక, మతపరమైన, చారిత్రక ప్రాధాన్యత కారణంగా ఇది కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. మైసూరు నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో అత్యంత అందమైన భాగం ఏమిటంటే కావేరీ నది చుట్టుముట్టబడి  ద్వీపంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..