Vande Bharat Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు.. 25 రోజుల్లో 4 ప్రమాదాలు
రాజస్థాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమై నెల కూడా కాలేదు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి వంటి సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వందే భారత్ రైలు ఉదయపూర్ నుండి బయలుదేరి జైపూర్ చేరుకుని.. అది మళ్లీ ఉదయ్‌పూర్‌కు బయలుదేరింది. ఆ సమయంలో భిల్వారాలోని రాయలా స్టేషన్ సమీపంలో అరాచకవాదులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడితో రైలులో కూర్చున్న ప్రయాణీకుల మధ్య గందరగోళం ఏర్పడింది. ఓ బోగీ అద్దాలు కూడా పగిలిపోయాయి.
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని భిల్వారాలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఇక్కడ మరోసారి వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరగడంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ రైలులోని ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలుపై రాళ్లు రువ్విన దుండగుల కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
రాజస్థాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమై నెల కూడా కాలేదు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి వంటి సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వందే భారత్ రైలు ఉదయపూర్ నుండి బయలుదేరి జైపూర్ చేరుకుని.. అది మళ్లీ ఉదయ్‌పూర్‌కు బయలుదేరింది. ఆ సమయంలో భిల్వారాలోని రాయలా స్టేషన్ సమీపంలో అరాచకవాదులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడితో రైలులో కూర్చున్న ప్రయాణీకుల మధ్య గందరగోళం ఏర్పడింది. ఓ బోగీ అద్దాలు కూడా పగిలిపోయాయి.
పగిలిన రైలు కిటికీ అద్దాలు
వందేభారత్ రైలు రైలా స్టేషన్ మీదుగా వెళ్లగానే ఒక్కసారిగా రైలుపై రాళ్లు పడటం.. బోగీల్లోని కిటికీ అద్దాలు పగులగొట్టడం హఠాత్తుగా జరిగింది. ఈ సమయంలో బోగీలో కూర్చున్న ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్టేషన్‌లో లోకో పైలట్ రైలును ఆపి విచారించగా ఒక అద్దం పగలడం కనిపించింది. ఈ ఘటనపై లోకో పైలట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లకు సమాచారం అందించారు. GRP, RPF బృందాలు విచారణ ప్రారంభించాయి.
25 రోజుల్లో 4 ప్రమాదాలు
వందేభారత్ రైలు ప్రారంభమై 25 రోజులు మాత్రమే గడిచింది. అయితే ఇప్పటికే నాలుగు ప్రమాదాలు సంభవించాయి. మొదటి రోజు రైలు ముందుకు పశువులు రావడంతో రైలు భాగాలు కూడా దెబ్బతిన్నాయి. రెండు రోజుల తర్వాత రైలు బోగీ అద్దాన్ని ఎవరో పగలగొట్టారు. ఆ తర్వాత రైలు ట్రాక్‌పై ఇనుప ముక్కలు, రాళ్లు, కాంక్రీటు వేశారు.. ఇప్పుడు భిల్వారాలో మళ్లీ రైలుపై రాళ్లు రువ్వారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..