Indian Air Force: మరింత బలోపేతంగా భారత ఎయిర్ ఫోర్స్.. 3 లక్షల కోట్ల విలువైన ఆధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలు

ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మంగళవారం భారత వైమానిక దళం తాజా వ్యూహాత్మక ప్రణాళికలను వెల్లడించారు. వచ్చే ఏడెనిమిదేళ్లలో రూ.2.5 నుంచి 3 లక్షల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, రాడార్లను ఐఏఎఫ్‌లో చేర్చనున్నాయని చెప్పారు. చైనాతో 3,488 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం భారత వైమానిక దళ కీలక వ్యూహాలలో ఒకటి. ఈ పర్యవేక్షణ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్యం (ISR) ద్వారా జరుగుతుంది.

Indian Air Force: మరింత బలోపేతంగా భారత ఎయిర్ ఫోర్స్.. 3 లక్షల కోట్ల విలువైన ఆధునిక యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలు
Indian Air Force
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2023 | 10:00 AM

మన పొరుగుదేశమైన చైనా విస్తరణ కాంక్షకు పాకిస్థాన్ మద్దతు తో భారత్ ను అస్థిర పరిచేలా ఇబ్బందులు పెట్టె విధంగా ఏదొక ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిరంతరం భారత్ కు ఈ రెండు దేశాల సైన్యాల నుంచి  రకరకాల సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను అధునాతన వ్యూహాలతో, అత్యాధునిక పరికరాలతో చెక్ పెట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమవుతోంది. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మంగళవారం భారత వైమానిక దళం తాజా వ్యూహాత్మక ప్రణాళికలను వెల్లడించారు. వచ్చే ఏడెనిమిదేళ్లలో రూ.2.5 నుంచి 3 లక్షల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, రాడార్లను ఐఏఎఫ్‌లో చేర్చనున్నాయని చెప్పారు.

చైనాతో 3,488 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం భారత వైమానిక దళ కీలక వ్యూహాలలో ఒకటి. ఈ పర్యవేక్షణ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్యం (ISR) ద్వారా జరుగుతుంది. ఏప్రిల్-మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక ఘర్షణ జరిగినప్పటి నుండి, చైనా భారతదేశానికి ఎదురుగా ఉన్న తన వైమానిక స్థావరాలను గణనీయంగా విస్తరించింది. రాడార్లు.. ఉపరితలం నుండి గైడెడ్ ఆయుధాల (SAGW) నెట్‌వర్క్‌ను మోహరించింది.

సరిహద్దు రేఖ వద్ద ఎదురయ్యే ప్రతి సంఘటనను ఎదుర్కొనేందుకు, IAF SAGWలు,  రాడార్‌లను కూడా LAC వెంట తక్కువ స్థాయి రవాణా చేయగల రాడార్‌లు (LLTRలు) మోహరించింది. అయితే భారత వైమానిక దళం  శత్రు భూభాగంలోకి తమ పరిధిని పెంచుకోవడానికి పర్వత రాడార్ కోసం చూస్తున్నారు. మరోవైపు.. భారత వైమానిక దళంతో పోలిస్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-ఎయిర్ ఫోర్స్‌లో నాలుగు రెట్లు ఎక్కువ యుద్ధ విమానాలు,  బాంబర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

 భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనా సైన్యం విన్యాసాలు 

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ , చైనాల మధ్య సమన్వయం గురించి ACM చౌదరి మాట్లాడుతూ  పాకిస్తాన్ ఇప్పుడు చైనీస్ JF-17 ‘థండర్’ బహుళ ప్రయోజన యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనీ ఆసక్తి చూపిస్తుందని చెప్పారు. ఈ యుద్ధం విమానం 25 అధునాతన J-10C జెట్‌లను కూడా జోడిస్తోంది. అంతేకాదు  పాక్, చైనా రెండు దేశాలు కలిసి సైనిక ఉమ్మడి విన్యాసాలను చేపట్టాయి. ‘షాహీన్’ వ్యాయామం గత నెల నుండి వాయువ్య చైనాలో జరుగుతోందన్నారు.

భారత్ రూ.3 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు

అనేక సవాళ్లు ఉన్నప్పటికీ  భారత వైమానిక దళం సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు ACM చౌదరి . అంతేకాదు వచ్చే ఏడాది రూ.1.72 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలతో భారత వైమానిక దళం పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL)తో ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఆర్డర్ చేసిన 83 యుద్ధ విమానాలు ఈ ప్రణాళికలో ఉన్నాయని పేర్కొన్నారు.

అంతేకాదు మరో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయనున్నారు. 1.2 లక్షల కోట్ల వ్యయంతో 180 తేజాస్ మార్క్-1ఎ జెట్‌లను కొనుగోలు చేయనున్నారు. తద్వారా ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్‌ల సంఖ్యను తగ్గించనున్నారు. అయితే కనీసం 42 అవసరం ఉందని.. మిగిలిన 60 MiG-21 ‘బైసన్’ 2025 నాటికి ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు.

ప్రణాళికలో భాగంగా భారత వైమానిక దళం 45,000 కోట్ల రూపాయల విలువైన 156 ‘ప్రచండ’ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయనుంది. ఇవి సియాచిన్ వంటి మంచు కొండల్లో, తూర్పు లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాలలో ప్రమాదకర కార్యకలాపాలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు మధ్య-శ్రేణి ఉపరితలం నుండి గగనతల క్షిపణి వ్యవస్థ (MR-SAM), నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ క్షిపణి స్క్వాడ్రన్ , ప్రలే బాలిస్టిక్ క్షిపణిని కూడా కొనుగోలు చేయనున్నారు.

మరోవైపు వైమానిక దళానికి చెందిన మొదటి విడతలో రూ.60,000 కోట్ల పథకంలో భాగంగా హై పవర్ రాడార్ , సుదూర (250 కి.మీ) ఐదు స్క్వాడ్రన్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను కూడా చేర్చారు. అదనంగా, 260 రష్యన్ మూలం సుఖోయ్-MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 84 దేశీయంగా రూపొందించిన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లతో అప్‌గ్రేడ్ చేయబడుతున్నాయి.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమైన ఒప్పందం

2018లో రష్యాతో కుదుర్చుకున్న $5.43 బిలియన్ల ఒప్పందం ఉక్రెయిన్ యుద్ధం కారణంగా  ఆలస్యం అయింది.  ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలోగా వైమానిక దళం ఐదు S-400 ట్రయంఫ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ స్క్వాడ్రన్‌లలో మిగిలిన రెండు భారత ఎయిర్ ఫోర్స్ లో చేరతాయని భావిస్తున్నారు.  380 కి.మీ పరిధిలో శత్రు వ్యూహాత్మక బాంబర్లు, జెట్‌లు, గూఢచారి విమానాలు, క్షిపణులు,డ్రోన్‌లను గుర్తించి, తటస్థీకరించగల మొదటి మూడు S-400 స్క్వాడ్రన్‌లు చైనా నుండి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి వాయువ్య దిశలో .. పాకిస్తాన్ ను ఎదుర్కోవడానికి తూర్పు భారతదేశంలో మోహరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..