Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్.. కాపాడండి అంటూ చిన్నారి నరకయాతన..

Lucknow, October 05: ప్రస్తుత కాంక్రిట్ జంగిల్‌లో ఎటు చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్సే కనిపిస్తుంటాయి. ప్రజల అభీష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఆపార్ట్‌మెంట్స్ వెలుస్తున్నారు. పదుల అంతస్తుల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిని మెట్ల మార్గంలో ఎక్కడం కష్టం కావున.. లిఫ్ట్‌లో ఏర్పాటు చేస్తారు బిల్డర్స్. అయితే, ఈ లిఫ్టులే ఇప్పుడు అపార్ట్‌మెంట్ వాసులకు పెద్ద తలనొప్పిగా మారాయి.

Watch Video: మధ్యలో ఆగిపోయిన లిఫ్ట్.. కాపాడండి అంటూ చిన్నారి నరకయాతన..
Girl Trapped In Lift
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 05, 2023 | 10:42 AM

Lucknow, October 05: ప్రస్తుత కాంక్రిట్ జంగిల్‌లో ఎటు చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్సే కనిపిస్తుంటాయి. ప్రజల అభీష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఆపార్ట్‌మెంట్స్ వెలుస్తున్నారు. పదుల అంతస్తుల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వీటిని మెట్ల మార్గంలో ఎక్కడం కష్టం కావున.. లిఫ్ట్‌లో ఏర్పాటు చేస్తారు బిల్డర్స్. అయితే, ఈ లిఫ్టులే ఇప్పుడు అపార్ట్‌మెంట్ వాసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. సరైన నిర్వహన లేకపోవడం వలన తరచూ మొరాయిస్తుంటాయి. మధ్యలో ఆగిపోవడం, డోర్ తెరుచుకోకపోవడం జరుగుతోంది. దాంతో జనాలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో లిఫ్ట్ కూలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. అయితే, తాజాగా ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిఫ్ట్‌ పని చేయక, డోర్ ఓపెన్ అవక.. లిఫ్ట్‌లో ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. దాదాపు 20 నిమిషాల పాటు తలుపులు తెరుచుకోకపోవడంతో బిడ్డ తల్లడిల్లిపోయింది. తనను కాపాడండి అంటూ ప్రాధేయపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కుర్సీ రోడ్‌లో జ్ఞానేశ్వర్ ఎన్‌క్లేవ్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్ ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అయితే, స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి.. లిఫ్ట్ ఎక్కింది. తను వెళ్లాల్సిన ఫ్లోర్ నెంబర్ క్లిక్ చేసింది. అయితే, సగం దూరం వెళ్లగానే లిప్ట్ మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ డోర్ ఎంతకీ ఓపెన్ అవలేదు. దాంతో చిన్నారి బెదిరిపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి.. లిఫ్ట్‌ డోర్ తెరిచేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోవడంతో తనను కాపాడండి అంటూ వేడుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు ఆ చిన్నారి లిఫ్ట్‌లో నరకయాతన అనుభవించింది. ఆ తరువాత లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో చిన్నారి సురక్షితంగా బయటపడింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి దాదాపు 20 నిమిషాల లిఫ్ట్‌లో ఎంత వేదన అనుభవించిందో ఆ వీడియోలో చూడొచ్చు. బిగ్గరగా అరుస్తూ భయంతో తల్లడిల్లిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..