AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు.. ఆస్పత్రికి క్యూ కడుతున్న జనం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు కాళ్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి.

Telangana: తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు.. ఆస్పత్రికి క్యూ కడుతున్న జనం
Viral Diseases Rise In Ts
Surya Kala
|

Updated on: Oct 05, 2023 | 7:40 AM

Share

తెలంగాణలో విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులతో జనం సతమతమవుతున్నారు. వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు విపరీతమైన ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. వీటికి తోడు కాళ్లు, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఇంట్లో ఒకరితో మొదలైన జ్వరం కుటుంబ సభ్యులంతా జ్వరాల బారిన పడుతుండడంతో భయాందోళనలు చెందుతున్నారు. విష జ్వరాలు మారుమూల గ్రామాల్లో, తండాలతో పాటు పట్టణాల్లో సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి.

విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధుల తీవ్రత గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ పల్లెల్లో జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో జ్వరాల బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నెలరోజుల వ్యవధిలో 42 మంది మృతి చెందడంతో ప్రజలు హడలిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో విష జ్వరాల కేసులు నమోదవుతాయని, అయితే ఈ నెలలో కూడా డెంగీ, మలేరియా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జ్వరాల నియంత్రణకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా తరుచూ నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లు సోకుకండా చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..