CEC Tour In TS: నేటి నుంచి 3 రోజులు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం

తెలంగాణలో ఎన్నికల పోరు మరింత వేడెక్కబోతుంది. ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. నేటి నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు.

CEC Tour In TS: నేటి నుంచి 3 రోజులు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం
Cec Tour In Ts
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2023 | 7:05 AM

తెలంగాణలో ఫుల్‌ ఎలక్షన్‌ ఫీవర్‌ వచ్చేస్తోంది. అందుకు తగ్గట్లే.. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించబోతోంది. ఇంతకీ.. తెలంగాణలో సీఈసీ టూర్‌ షెడ్యూల్‌ ఏంటో చూద్దాం. తెలంగాణలో ఎన్నికల పోరు మరింత వేడెక్కబోతుంది. ఇప్పటికే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. నేటి నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇక.. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్‌ చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణాలో బస చేయనుంది. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించనుంది.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది. సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు రానున్న ఎన్నికల అధికారుల బృందంలో ఎలక్షన్‌ కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీశ్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు అజయ్‌ భాడూ, హిర్దేశ్‌కుమార్‌, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహూ తదితరులు ఉన్నారు.

సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సమావేశం కానున్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఎన్నికల బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. పర్యటన చివరల్లో పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనుంది. మొత్తంగా.. సెంట్రల్‌ ఎలక్షన్ కమిషన్ టీమ్‌.. తెలంగాణలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి షెడ్యూల్ విడుదలైతే అన్ని రాజకీయ పార్టీలు, నేతలు పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..