Telangana: తండ్రి కష్టం చూడలేని తనయుడి ఆలోచన.. సరికొత్త ఆవిష్కరణతో పేటెంట్ హక్కు పొందిన స్టూడెంట్

హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అభిషేక్ ఐకేపీ కేంద్రాల్లో గన్నీ సంచుల్లో వడ్లు నింపేందుకు తన తండ్రి పడుతున్న ఇబ్బందులను చూసి ధాన్యం నింపే యంత్రాన్ని తయారు చేశాడు. 2019లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో మొదటి బహుమతిని గెలుచుకుంది ఈ యంత్రం. వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌లో మెరిట్ పాయింట్లు సాధించి జాతీయ స్థాయి ఈవెంట్‌కు ప్రమోషన్ పొందింది.

Telangana: తండ్రి కష్టం చూడలేని తనయుడి ఆలోచన.. సరికొత్త ఆవిష్కరణతో పేటెంట్ హక్కు పొందిన స్టూడెంట్
Maripelli Abhishek
Follow us
G Sampath Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2023 | 2:32 PM

కృషి, పట్టుదల ఉంటే చాలు వయసుతో సంబంధం ఏముంది.. సరికొత్త ఆవిష్కరణలు సృష్టించవచ్చు అని ఒక బాలుడు నిరూపించాడు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ఆవిష్కరణకు పేటెంట్‌ పొందాడు. మరిపెల్లి అభిషేక్ అనే బాలుడు తన తండ్రి లక్ష్మీరాజం పేరు మీద తయారు చేసిన వరి నింపే యంత్రానికి పేటెంట్ హక్కు పొందాడు. రాజన్న సిరిజిల్లా జిల్లాకు చెందిన  హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అభిషేక్ ఐకేపీ కేంద్రాల్లో గన్నీ సంచుల్లో వడ్లు నింపేందుకు తన తండ్రి పడుతున్న ఇబ్బందులను చూసి ధాన్యం నింపే యంత్రాన్ని తయారు చేశాడు. 2019లో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో మొదటి బహుమతిని గెలుచుకుంది ఈ యంత్రం. వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌లో మెరిట్ పాయింట్లు సాధించి జాతీయ స్థాయి ఈవెంట్‌కు ప్రమోషన్ పొందింది.

ఢిల్లీలోని ఐఐఐటీలో జరిగిన జాతీయ ప్రదర్శనలో ఈ ధాన్యం నింపే యంత్రం మూడో స్థానంలో నిలిచింది. అభిషేక్ NIT-వరంగల్‌లో రోబోటిక్స్‌లో నెల రోజుల పాటు శిక్షణ పొందాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన FINE కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంతేకాదు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (NIF) ద్వారా నిర్వహించబడే జపాన్ కు చెందిన సాకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు కూడా ఎంపికయ్యాడు విద్యార్థి అభిషేక్ .

అభిషేక్ తన ఆవిష్కరణకు పేటెంట్ పొందడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అభిషేక్ ను కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు. అంతేకాదు విద్యార్థి అభిషేక్ ను డీఈవో రమేష్‌, స్కూల్ హెడ్ మాస్టర్  శ్రీకాంత్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి పాముల దేవయ్య, గైడ్‌ కోరెం వెంకటేశం, సర్పంచ్‌ జంకె విజయ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ జంకె మల్లేశం అభిషేక్‌ను అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది