AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. టెన్షన్‌లో రేవంత్ రెడ్డి..!

Note For Vote Case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన 'ఓటుకు నోటు' కేసు మరోసారి బ్యానర్‌ ఐటమ్‌గా నిలిచింది. ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డిస్కర్షన్‌గా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు సహా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ కేసులో మరింత సంకట స్థితిని కలిగించనుంది.

Telangana: చంద్రబాబుకు మరో బిగ్ షాక్.. టెన్షన్‌లో రేవంత్ రెడ్డి..!
Chandrababu Naidu
Vijay Saatha
| Edited By: Shiva Prajapati|

Updated on: Oct 01, 2023 | 12:50 PM

Share

Note For Vote Case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు మరోసారి బ్యానర్‌ ఐటమ్‌గా నిలిచింది. ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డిస్కషన్‌గా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసు సహా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఈ కేసు కూడా తోడైంది. ఈ కేసు ఆయనకు మరింత సంకట స్థితిని కలిగించనుంది. అదే సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డిని సైతం టెన్షన్‌కు గురి చేస్తోంది.

డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం ఈ పిటిషన్‌ను విచారించడానికి ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసు బెంచ్ ముందుకు వస్తుందనగా.. చంద్రబాబుకు మరో పెద్ద చిక్కు వచ్చిపడింది. అదే ఓటు కు నోటు కేసు. ఈ కేసును విచారించాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను చాలా రోజుల క్రితమే వేయగా.. ఇప్పుడది విచారణకు వచ్చింది. ఓటు నోటు కేసులో దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్ 4వ తేదీన విచారణ జరుగనుంది. ఒకవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని, రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌ 3న విచారణకు రానుండగా.. ఆ మరుసటి రోజే ఓటుకు నోటు కేసు కూడా విచారణకు వస్తోంది. ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందా అని టీడీపీ శ్రేణులు ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తున్నాయి.

రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి?

చంద్రబాబు పరిస్థితి అలా ఉంటే.. రేంవంత్ పరిస్థితి నెక్ట్స్ ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. తెలంగాణలో ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని ఫుల్ జోష్‌మీదున్న రేవంత్.. రాష్ట్రం మొత్తం కలియదిరుగుతూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. ఆయా పార్టీల నుంచి నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ‘ఓటుకు నోటు కేసు’ సుప్రీంకోర్టులో విచారణకు రావడం.. రేవంత్‌లో ఇంటర్నల్‌గా టెన్షన్ క్రియేట్ చేస్తోందని టాక్. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వస్తుండటంతో ఏం జరుగుతుందో? అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఓటుకు నోటు కేసుపై సీబీఐ విచారణ చేయించాలంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి ఆ అభ్యర్థన ప్రకారం.. కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తారా? లేక సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది? అనేది ఇప్పుడు రేవంత్ వర్గంలో టెన్షన్ ను క్రియేట్ చేస్తోంది.

ఏది ఏమైనా.. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబుకు ఇది మరింత ఇబ్బంది కలిగించే అంశం కాగా.. తెలంగాణలో తమదే అధికారం అంటూ ఫుల్ జోష్‌లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు స్పీడ్‌ బ్రేకర్‌లా మారనుందనేది టాక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..