Telangana Congress: కాంగ్రెస్‌లో ‘మైనంపల్లి’ చేరిక చిచ్చు.. పార్టీకి కీలక నేత రాజీనామా..

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ చేరిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. చేరిక అనంతరం మల్కాజిగిరి టికెట్‌ తనకే వస్తుందని మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన అనుచరులు బహిరంగంగా ప్రకటించడంతో హస్తం పార్టీలో ఒక్కసారిగా లొల్లి మొదలైంది. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడి పనిచేసిన తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా మైనంపల్లి హన్మంతరావుకి టికెట్ ఎలా ఇస్తారని నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2023 | 1:30 PM

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కొడుకు రోహిత్ చేరిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. చేరిక అనంతరం మల్కాజిగిరి టికెట్‌ తనకే వస్తుందని మైనంపల్లి హన్మంతరావుతోపాటు ఆయన అనుచరులు బహిరంగంగా ప్రకటించడంతో హస్తం పార్టీలో ఒక్కసారిగా లొల్లి మొదలైంది. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడి పనిచేసిన తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా మైనంపల్లి హన్మంతరావుకి టికెట్ ఎలా ఇస్తారని నందికంటి శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో తానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. టిక్కెట్ ఇవ్వకపోతే తన తడఖా చూపిస్తానని బహిరంగంగానే సవాల్‌ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, అంజనీ కుమార్‌ యాదవ్‌ సోమవారం మైనంపల్లి నివాసానికి వెళ్లిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉంటే.. హన్మంతరావు చేరిక ఎపిసోడ్‌ అటు మెదక్‌లోనూ చిచ్చు పెట్టింది. మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు టిక్కెట్‌ కన్ఫామ్‌ అనే వార్తలు రావడంతో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అధిష్ఠానంపై సీరియస్‌ అయ్యారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా మీరిచ్చే గుర్తింపు అంటూ ఏకంగా కాంగ్రెస్‌కే రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న టికెట్ల కేటాయింపు.. ఆరోపణలతో మనోవేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వ్యతిరేకులకు నాయకత్వం అప్పగించారని మండిపడ్డారు. నోట్ల కట్టలను నమ్ముకునే వారు నడిబజారులో నవ్వులపాలు అవ్వడం ఖాయమన్నారు.

ఈ మేరకు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదివారం లేఖను విడుదల చేశారు. ప్రజా బలం ప్రాతిపాదికన కాకుండా కేవలం ధన బలానికే ప్రాధాన్యత ఇస్తున్నారు..దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు.. సోనియా, రాహుల్ మౌనం వహించడం బాధ కలిగిస్తోందని.. ఈ సమయంలో పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదని లేదని లేఖలో కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక మోడల్‌.. అంటూ హడావుడి చేసిన నాయకత్వ వ్యవహార శైలి ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోందంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..