Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్రేజీ లులు మాల్‌లో షాపింగ్ కోసం ఎగబడుతున్న నగర వాసులు.. 3 కి.మీ. ట్రాఫిక్ జామ్..

శనివారం రోజు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో లులు మాల్ నూతనంగా ఏర్పాటయింది. ఈ మాల్ ఓపెనింగ్ రోజు సైతం విపరీతమైన ప్రచారం లభించింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ మాల్ పై విపరీతమైన చర్చ నడుస్తుంది. దీంతో ఒకసారైనా ఈ మాల్ కు వెళ్లాలని నగరవాసులు ఎగబడుతున్నారు. వీకెండ్ కావడంతో మాల్ కు ఒక్కసారిగా జనం పోటెత్తారు.

Hyderabad: క్రేజీ లులు మాల్‌లో షాపింగ్ కోసం ఎగబడుతున్న నగర వాసులు.. 3 కి.మీ. ట్రాఫిక్ జామ్..
Lulu Mall Hyderabad
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Surya Kala

Updated on: Oct 01, 2023 | 1:57 PM

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కొద్ది రోజుల క్రితమే లులు మాల్ ప్రారంభమైంది. కూకట్ పల్లిలోని  జే ఎన్ టియూ దగ్గర ఉన్న లులు మాల్ గత బుధవారం రోజు లాంచనంగా ప్రారంభమైంది. నగరంలో మొదటి సరిగా లులు గ్రూప్ ఈ మాల్ ను ప్రారంభించింది. దీంతో సాధారణంగానే నగర వాసులు ఒక్కసారైనా సరే ఈ మాల్ ను సందర్శించాలని అనుకుంటారు. దీంతో వీకెండ్ ప్లాన్ గా లులు మాల్ కు వెళ్లాలనుకుంటే ఇక మీకు చిరాకు తప్పదు. ఎందుకంటే మూడు రోజుల సెలవుల కారణంగా చాలామంది లులు మాల్ ను సందర్శిస్తున్నారు. మాల్ కు వచ్చే ప్రేక్షకుల కారణంగా కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

శనివారం రోజు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో లులు మాల్ నూతనంగా ఏర్పాటయింది. ఈ మాల్ ఓపెనింగ్ రోజు సైతం విపరీతమైన ప్రచారం లభించింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ మాల్ పై విపరీతమైన చర్చ నడుస్తుంది. దీంతో ఒకసారైనా ఈ మాల్ కు వెళ్లాలని నగరవాసులు ఎగబడుతున్నారు. వీకెండ్ కావడంతో మాల్ కు ఒక్కసారిగా జనం పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగానే జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీ వెళ్లే రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మాల్ ప్రారంభంతో ట్రాఫిక్ మరింత ఎక్కువైపోయింది. ఈ మాల్ ప్రారంభమైన గత బుధవారం నుండి జనాలు విపరీతంగా మాల్ కి వెళ్తున్నారు. అటు మూడు రోజుల సెలవులు కావడంతో ఊర్లకు వెళ్లే బస్సులు సైతం కుకట్పల్లి రోడ్డు మీద నుండి వెళ్లడంతో ఒకవైపు ప్రైవేటు బస్సుల ట్రాఫిక్ మరోవైపు లులు మాల్ హడావిడితో కూకట్పల్లి రద్ధిగా మారిపోయింది. ఈ మాల్ కు వచ్చే జనాల కేంద్రంగా కూకట్పల్లి నుండి జేఎన్టీయూ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయ్యి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మోతాదుకు మించి జనాలు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. ఈ మాల్ దగ్గర రద్దీ కారణంగా రెండు రోజుల నుండి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో ఐకియా ప్రారంభోత్సవంలోనూ ఇదే సీన్ కనిపించింది.. ఐకియ స్టోర్ ప్రారంభమైన మొదటి పది రోజులు విపరీతమైన రద్దీ కనిపించింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట సైతం జరిగింది. ఇప్పుడు లులు మాల్ వద్ద కూడా అదే సీన్ కనిపిస్తుంది. 300 కోట్ల రూపాయలతో ఈ మాల్ ప్రారంభించారు. అటు పోలీసులు సైతం రద్దీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ మాల్ ను . సందర్శించాలనుకునేవారు వీకెండ్ లో కాకుండా సాధారణ రోజులు సాయంత్రాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..