Hyderabad: హైదరాబాద్ సిగలో మరో అందమైన హైటెక్ ట్రాక్.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్..
Hyderabad, October 01: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్ నగరవాసుల ముందుకు వచ్చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన సోలార్ సైకిల్ ట్రాక్ సిద్ధం అయింది. ఓ వైపు సువాసన వెదజల్లే పూల మొక్కలు.. ప్రశాంతమైన వాతావరణంతో ఎంతో హ్యాపీగా సైక్లింగ్ చేసుకోవచ్చు. దేశ విదేశాలలో సైతం లేని విధంగా ఈ సోలార్ సైక్లింగ్ ట్రాక్ ను సిద్ధం చేశారు.
Hyderabad, October 01: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్ నగరవాసుల ముందుకు వచ్చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన సోలార్ సైకిల్ ట్రాక్ సిద్ధం అయింది. ఓ వైపు సువాసన వెదజల్లే పూల మొక్కలు.. ప్రశాంతమైన వాతావరణంతో ఎంతో హ్యాపీగా సైక్లింగ్ చేసుకోవచ్చు. దేశ విదేశాలలో సైతం లేని విధంగా ఈ సోలార్ సైక్లింగ్ ట్రాక్ ను సిద్ధం చేశారు. నగరంలో సైక్లింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాక్ సౌకర్యాన్ని కల్పించింది. సిటీలో సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నా.. వాటిని సైతం వాహనదారులు వినియోగిస్తున్నారు. దాంతో సైక్లింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ట్రాక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వెంట రెండు భాగాలుగా 23 కిలోమీటర్ల మేర మూడు వరసలుగా, 4.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న అదునాతన సోలార్ సైకిల్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 1 న దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ. 100 కోట్ల వ్యయంతో సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ గత ఏడాది సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయగా.. మొదటి ట్రాక్ నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు ఉండగా.. రెండో ట్రాక్ నానక్ రామ్ గూడ నుంచి కొల్లూరు వరకు అంటే 14.5 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు.
పైకప్పుగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ ద్వారా రోజుకు 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ట్రాక్ పక్కన వివిధ రకాల పూల మొక్కలను నాటారు. పక్కనే టిఫిన్స్ స్టాల్స్ లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినట్లు ఐటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
Introducing India’s first and only 23 km long, 3 laned, 16 MW solar power generating Healthway
2nd in world after South Korea (solar roof top covered)
Great job @HMDA_Gov 👍 pic.twitter.com/iXifgip7rS
— KTR (@KTRBRS) October 1, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..