తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ

తెలంగాణ సర్కార్ అక్రమాలకు పాల్పడుతోంది: ప్రధాని మోదీ

Ram Naramaneni

|

Updated on: Oct 01, 2023 | 5:34 PM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్‌మెంట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్​లో జరిగే పబ్లిక్ మీటింగ్‌కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్​ ప్లాంట్​ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్​ను జాతికి అంకితం చేయనున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పాలమూరు జిల్లా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.13,500 కోట్ల విలువైన పలు డెవలప్‌మెంట్ పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలు చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూరు వెళ్లారు. అక్కడ అమిస్తాపూర్​ శివారులోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​కు చేరుకున్నారు. అక్కడి నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొన్నారు. తిరిగి సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్​ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. మరలా అక్టోబరు 3న నిజామాబాద్​లో జరిగే పబ్లిక్ మీటింగ్‌కు మోదీ రానున్నారు. అక్కడి నుంచే రామగుండంలోని NTPCలో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్​ ప్లాంట్​ను ప్రారంభించనున్నారు. ఆ ప్లాంట్​ను జాతికి అంకితం చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Oct 01, 2023 03:00 PM