AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అంగన్‌వాడి టీచర్లకు గుడ్‌ న్యూస్.. వరాల జల్లు కురిపించిన సర్కార్..

Telangana: అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్ వాడీ టీచర్లను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్లు ఆదివారం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని..

Telangana: అంగన్‌వాడి టీచర్లకు గుడ్‌ న్యూస్.. వరాల జల్లు కురిపించిన సర్కార్..
Telangana CM KCR
Shiva Prajapati
|

Updated on: Oct 01, 2023 | 11:54 AM

Share

Telangana: అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్ వాడీ టీచర్లను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్లు ఆదివారం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని హైదరాబాద్ లోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్ వాడీల సమ్మెపై ఏఐటీయూసీ, సిఐటియు నాయకులతో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. వారి డిమాండ్లను విని మంత్రులు సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీ లో అంగన్వాడీలను చేర్చుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరి జీతాలను కూడా పెంచుతామని అన్నారు.

ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మిగిలిన డిమాండ్లపై నివేదికను సమర్పించవలసిందిగా మహిళా శిశు సంక్షేమ సెక్రెటరీని భారతి హోలికేరినీ ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

70 వేల మంది అంగన్వాడీ టీచర్లకు ప్రయోజనం..

సీఎం కేసీఆర్ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులకు లాభం చేకురుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వాలు అంగన్వాడీల గురించి పట్టించుకోలేదని, అంగన్వాడి వర్కర్లుగా ఉన్న వారి పేరును అంగన్వాడి టీచర్లుగా గౌరవప్రదంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి.. తమ డిమాండ్లన్నింటిపై సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయంపై అంగన్వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..