Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muthireddy Yadagiri Reddy: కేసీఆర్‌ శరీరంలో ముత్తిరెడ్డి ఒకరు.. దాన్ని రెండు ముక్కలు చేస్తే సహించేది లేదు: ముత్తిరెడ్డి

ఒక్క ఫొటో.. చిరునవ్వులు చిందిస్తూ ఫొజిచ్చారు.. ఇంకేముంది అంతా సెట్ అయింది.. ఇక వర్గపోరుకు చెక్ పడినట్లే అనుకున్నారు అంతా.. కానీ, చూస్తుండగానే సీన్ రివర్స్ అయింది.. జనగామ బీఆర్ఎస్‌లో మళ్లీ వర్గపోరు తెరపైకి వచ్చింది. జనగామలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. జనగామ బీఆర్‌ఎస్‌లో ఈ మధ్య వర్గపోరు ఎక్కువైపోయిందంటూ వాపోయారు.

Muthireddy Yadagiri Reddy: కేసీఆర్‌ శరీరంలో ముత్తిరెడ్డి ఒకరు.. దాన్ని రెండు ముక్కలు చేస్తే సహించేది లేదు: ముత్తిరెడ్డి
Jangaon Brs Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2023 | 12:06 PM

ఒక్క ఫొటో.. చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు.. ఇంకేముంది అంతా సెట్ అయిపోయింది.. ఇక వర్గపోరుకు చెక్ పడినట్లే అనుకున్నారు అంతా.. కానీ, చూస్తుండగానే సీన్ రివర్స్ అయింది.. జనగామ బీఆర్ఎస్‌లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. జనగామ బీఆర్‌ఎస్‌లో మళ్లీ వర్గపోరు ఎక్కువైపోయిందంటూ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫైరయ్యారు. జనగామలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేశారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఘటనను మించి.. జనగామలో రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ ముత్తిరెడ్డి విమర్శించారు. జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డికి తెలియకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన వర్గీయులతో కలిసి సమావేశమయ్యారు. ఇదే ముత్తిరెడ్డి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గంలో మీటింగ్‌ ఎలా పెడతారని, పార్టీని రెండు వర్గాలుగా చేస్తున్నారంటూ పల్లా అండ్‌ కో వర్గీయులపై ముత్తిరెడ్డి విమర్శలకు దిగారు.

జనగామలో కేసీఆర్‌ వర్గం తప్ప.. మరో వర్గం లేదని.. కేసీఆర్‌ శరీరంలో ముత్తిరెడ్డి ఒకరు.. దాన్ని రెండు ముక్కలు చేస్తే సహించనంటూ ఆయన ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. తాజా ఘటనల గురించి మాట్లాడుతూ.. మహాభారతం, రామాయణంలో ఘట్టాలను వివరిస్తూ కామెంట్లు చేయడం ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల మంత్రి కేటీఆర్‌తో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫొటో దిగారు. దీంతో ఈ ఫొటో నెట్టింట చక్కెర్లు కొట్టింది. అటు స్టేషన్‌ ఘన్‌ పూర్‌ టికెట్ దక్కకపోవడంతో రాజయ్య, ఇటు జనగాం టికెట్‌ దక్కకపోవడంతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించిన అధిష్టానం.. రాజయ్యకు, ముత్తిరెడ్డికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. జనగామ సీటును పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆశిస్తున్నట్టు సమాచారం.

ముత్తిరెడ్డికి టికెట్‌ ఇవ్వకపోవడంతో.. పల్లాకే సీటు ఖారారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫొటో వైరల్‌ అయిన తర్వాత మాట్లాడిన రాజయ్య.. తాను ఫోటోలకు ఫొజులు మాత్రమే ఇచ్చానంటూ రివర్స్ గేర్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పల్లా తీరుపై ముత్తిరెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..