Mumbai: కూతురు పుట్టిందని అత్తింట్లో ఆరళ్లు.. 40 రోజుల చిన్నారిని 14వ అంతస్థునించి పడేసి హత్య చేసిన తల్లి..

ములుండ్ వెస్ట్‌లోని జెవార్ రోడ్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇక్కడ సొసైటీలోని ఒక భవనంలో 14వ అంతస్తులో ఈ వికలాంగ మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు 40 రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది. కూతురు పుట్టిన ఈ 40 రోజుల్లో ఇంట్లో పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది.

Mumbai: కూతురు పుట్టిందని అత్తింట్లో ఆరళ్లు.. 40 రోజుల చిన్నారిని 14వ అంతస్థునించి పడేసి హత్య చేసిన తల్లి..
Mumbai News
Follow us

|

Updated on: Sep 23, 2023 | 8:58 AM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ తన 40 రోజుల కుమార్తెను దారుణంగా హత్య చేసింది. 14వ అంతస్తులోని బాల్కనీ నుంచి చిన్నారిని కింద పడేసింది. చికిత్స నిమిత్తం బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు అప్పటికే చిన్నారి మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక తల్లిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళను ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు వికలాంగురాలు. చిన్నారి తల్లికి మాట్లాడలేదు. వినిపించదు. అందువల్ల ఈ సంఘటన వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుండ్ వెస్ట్‌లోని జెవార్ రోడ్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఇక్కడ సొసైటీలోని ఒక భవనంలో 14వ అంతస్తులో ఈ వికలాంగ మహిళ తన కుటుంబంతో కలిసి  నివసిస్తోంది. ఆమెకు 40 రోజుల క్రితమే ఆడపిల్ల పుట్టింది.

ఇవి కూడా చదవండి

కూతురు పుట్టిన ఈ 40 రోజుల్లో ఇంట్లో పరిస్థితులు మారినట్లు తెలుస్తోంది. కూతురు పుట్టిందని అత్తింట్లో మొదలైన తగాదాల వలన కోపంతో ఆ మహిళ అభం శుభం తెలియని.. పసి గుడ్డుని బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. పోలీసులు కూడా ఇంతటి దారుణం చేయడానికి కారణం కూతురు పుట్టిందన్న విషయంలో ఇంట్లో గొడవలు జరిగడమే అని అనుమానిస్తున్నారు.  అయితే ఈ దారుణ ఘటన జరగడానికి గల కారణములు మరింత స్పష్టంగా తెలియాల్సి ఉందని అంటున్నారు.

కూతురు చంపినందుకు ఆ తల్లిని విచారించాల్సి ఉందని.. అయితే ఆమెకు మాట్లాడటం రాదని, వినికిడి శక్తి లేకపోవడంతో ఆమెను ఇంకా సరిగా విచారించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ మహిళపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు తమ ప్రాధమిక విచారణలో గత ఏడాది జూలై నెలలో ఈ మహిళకు జన్మించిన  ఏడు నెలల చిన్నారి మృతి చెందినట్లు వెల్లడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..