- Telugu News Photo Gallery Ganesh Chaturthi 2023: Lord Ganesha and Ganesha Temple Decorated by notes and coins in Bengaluru
Ganesh Chaturthi: రూ. 2 కోట్ల నోట్లు, 50 లక్షల నాణేలతో గణపయ్యను, ఆలయాన్ని రెడీ చేసిన భక్తులు.. దేశ భక్తి థీమ్ తో అలరిస్తున్న మండపం..
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి హిందువు ఇంట్లో వినాయకుడు పూజలను అందుకుంటున్నాడు. ప్రతి గల్లీలోని మండపాలలో కొలువుదీరాడు. పలు మండపాల్లో భక్తులు గణపతి పట్ల భక్తిని తమ అభిరుచిని జోడించి విభిన్న రూపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మండపాలను మాత్రమే కాదు.. అందులో కొలువుదీరిన గణపయ్య వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు. వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసిన మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Sep 19, 2023 | 11:06 AM

వినాయక చవితి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. అనేక మండపాల్లోని ఏర్పాటు చేసిన బుజ్జి గణపయ్యకు తమ దేశ భక్తి, సామజిక సృహను జోడిస్తూ వివిధ రూపాలను ఇస్తున్నారు. మరికొందరు డబ్బులతో మండపాలతో పాటు వినాయకుడిని రెడీ చేశారు.

బెంగళూరులోని పుట్టెనహళ్లికి చెందిన జె.పి. నగరంలోని సత్యసాయి గణపతి ఆలయం వినాయక చవితి వేడుకలను అందంగా ముస్తాబైంది. ఈ ఆలయాన్ని అలంకరించడానికి పువ్వులు, పండ్లకు బదులుగా నోట్లు, నాణేలను ఉపయోగించారు. అత్యంత ఖరీదుగా అందంగా అలంకరించారు.

ఆలయాన్ని విగ్రహాన్ని అలంకరించడానికి రూ.2 కోట్లకు పైగా నోట్లతో పాటు 50 లక్షల విలువైన నాణేలను ఉపయోగించి .. ఆలయాన్ని సుందర రూపాన్ని తీసుకొచ్చారు.

58 లక్షల విలువైన నాణాల్లో 5, 10, 20 నాణాలను ఉపయోగించగా.. నోట్లలో రూ. 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను వినియోగించారు. పువ్వుల మాలను ఏవిధంగా రంగురంగులుగా తయారు చేస్తారో.. అదే విధంగా డిఫరెంట్ కలర్స్, సైజుల్లో ఉన్న ఈ నాణేలు, నోట్లను ఉపయోగించి మాలలుగా తయారు చేశారు.

ఈ ఆలయం నిఘా నీడలో ఉంది. ఉత్సవాలను, గణపతి అలంకారాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులను నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షించనున్నాయి. అలంకరణ సొమ్మును భక్తులు తాకకుండా బారికేడ్ లను ఏర్పాట్లు చేశారు.

చంద్రయాన్ - 3, జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్ తో నోట్లు, నాణేలతో గణపతి ఉత్సావాలకు ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకున్నారు.

ఈ ఆలయంలో 22 సీసీటీవీల ఏర్పాటు చేశారు. నిరంతరం గన్ మ్యాన్, సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. ట్రస్టు సభ్యులు భక్తులను నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

ఈ అలంకరణను ఆలయ నిర్వాహక మండలి సభ్యులు, 150 మందికి పైగా చేశారు.





























