Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. పెళ్లికి ముందే మామను లేపేశాడు.. ఎందుకో తెలుసా..?

కట్నం కోసం మహిళలను వేధించిన అనేక ఘటనలను చూశాం.. కట్నం కోసమే కాదు డబ్బుల కోసం భార్యలను అనేక విధాలుగా వేధించిన భర్తల సంగతినీ చూశాం.. కానీ పెళ్లికి ముందే అధిక కట్నం మామను చంపిన ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సభ్య సమాజంలో ఇంకా ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన

Andhra Pradesh: వీడు మామూలోడు కాదు.. పెళ్లికి ముందే మామను లేపేశాడు.. ఎందుకో తెలుసా..?
AP Crime News
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 23, 2023 | 10:46 AM

కట్నం కోసం మహిళలను వేధించిన అనేక ఘటనలను చూశాం.. కట్నం కోసమే కాదు డబ్బుల కోసం భార్యలను అనేక విధాలుగా వేధించిన భర్తల సంగతినీ చూశాం.. కానీ పెళ్లికి ముందే అధిక కట్నం మామను చంపిన ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సభ్య సమాజంలో ఇంకా ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నెమరిపురిలో షరీష్ ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను అదే గ్రామానికి చెందిన షేక్ సైదా కుమారుడు చినశీను బాషాకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇరు వర్గాల అంగీకారంతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్ఢం కూడా జరిగింది. నిశ్చితార్ధం సమయంలోనే కట్న కానుకుల గురించి మాట్లాడుకున్నారు. నాలుగు లక్షల రూపాయలు కట్నం ఇవ్వాలని అంగీకారం సైతం కుదిరింది. ఆ మెత్తాన్ని షరీష్ చినశీను బాషాకు చెల్లించాడు. అయితే పెళ్లి చేసుకోవాలని షరీష్ అడుగుతుంటే కట్నం సరిపోదని చెప్పడం మొదలు పెట్టారు కుటుంబసభ్యులు..

దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. రెండు మూడు సార్లు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈక్రమంలోనే పెళ్లికి ముందే కట్నం విషయంలో గొడవ జరగడం తట్టుకోలేని షరీఫ్ తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదం ఇలా జరుగుతున్న సమయంలోనే ఈ నెల 18 తేది రాత్రి పదిగంటల సమయంలో చినశీను బాషాతో పాటు మరో నలుగురు షరీఫ్ ఇంట్లోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మరోసారి పెళ్లి, కట్నంపై వాగ్వివాదం జరిగింది.

ఈ వాగ్వివాదం జరుగుతున్న సమయంలోనే చినశీను బాషా తన చేతిలో ఉన్న కత్తితో షరీఫ్ పై దాడి చేశాడు. దాడి తర్వాత చినశీను బాషా అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలైన షరీఫ్ ను కుటుంబ సభ్యులు మొదట సత్తెనపల్లి ఆసుపత్రికి.. అక్కడినుంచి గుంటూరు జిజిహెచ్ కి మెరుగైన వైద్యం కోసం తరలించారు. అయితే చికిత్స పొందుతూనే షరీష్ చనిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చినశీను బాషా అతని కుటుంబ సభ్యులపై షరీష్ భార్య సైదాబి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన రాజుపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం