Lord Ganesh: వామ్మో విఘ్నాలకధిపతి వినాయకుడికి 108 రకాల ప్రసాదాలు.. ఇంతకీ ఎక్కడ..
గణపతి నవరాత్రులు దేశ వ్యక్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హిందూ సనాతన ధర్మంలో వినాయకుడునీ ఉండ్రాళ్ళ ప్రియుడని, నైవేద్య ప్రియుడని చెబుతూ ఉంటారు. అందుకే ఏడాదికి ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారికి ప్రసాదానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటారు భక్తులు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసంతో పాటు వివిధ రకాలైన ఫలాలు సమర్పించి ఆరాధిస్తారు.