KNRUHS: కాళోజీ హెల్త్ వర్సిటీలో ఫేక్ సర్టిఫికేట్ల కలకలం.. ఏడుగురు ఏపీ విద్యార్థుల ప్రవేశాల రద్దు..
కాళోజి నారాయణరావ్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహరం సంచలనం సృష్టిస్తోంది. ఏడుగురు విద్యార్ధులు వర్సిటీలో సీట్లు పొందిన తీరు అందరినీ ఆశ్యర్యం కలిగిస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో.. ఏడుగురు ఏపీ విద్యార్ధులు స్థానిక కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. దీనిపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది.
కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ సర్టిఫికెట్లు కేసులో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఫేక్ పట్టాల యవ్వారం గుట్టురట్టయింది. కాళోజి నారాయణరావ్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెలుగు చూసిన నకిలీ సర్టిఫికెట్ల వ్యవహరం సంచలనం సృష్టిస్తోంది. ఏడుగురు విద్యార్ధులు వర్సిటీలో సీట్లు పొందిన తీరు అందరినీ ఆశ్యర్యం కలిగిస్తోంది. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో.. ఏడుగురు ఏపీ విద్యార్ధులు స్థానిక కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. దీనిపై వర్సిటీ అధికారులకు అనుమానం వచ్చింది.
ఎంక్వైరీ మొదలు పెడితే అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీరంతా 6 నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టు ధృవపత్రాలు పొందుపరిచారు. హెల్త్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అలా చదివితే లోకల్ అభ్యర్థుల కిందసీటు పొందొచ్చు. దీంతో.. స్థానిక కోటాలో సీట్లు దక్కించుకున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివినట్లు సర్టిఫికెట్స్ పొందుపరిచారు. నీట్ పరీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాయడంతో అధికారులు అనుమానం వచ్చింది.
ఒరిజినల్ ధృవపత్రాలతో ప్రత్యక్షంగా వర్సిటీకి రావాలని విద్యార్థులను కోరడంతో పొంతనలేని సమాధానాలు చెప్పడం డొంక కదిలించాయి. విజయవాడలో కన్సల్టెన్సీ నడిపే కామిరెడ్డి నాగేశ్వరరావు తమకు తెలియకుండా ధ్రువ పత్రాలు పొందుపరిచారని విద్యార్ధులు తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల వరకూ వసూలు చేసి ఈ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని తెలిసింది. దాంతో.. ఆయా ధృవపత్రాలు నకిలీవని తేల్చిన వర్సిటీ.. వారి ప్రవేశాలను రద్దు చేసింది. మరోవైపు.. కన్సల్టెన్సీ నిర్వాహకుడు నాగేశ్వరరావుతోపాటు ఏడుగురు విద్యార్థులపై మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యునివర్సిటీ ఫిర్యాదు మేరకు.. ప్రత్యేక పోలీస్ బృందాలు విజయవాడకు వెళ్లాయి. అయితే నిందితుడు నాగేశ్వరావు పరారీలో ఉన్నారు. అయితే.. విద్యార్ధులపై వేటు పడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..