TS Police Constable Final Results 2023: తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల.. మొత్తం ఎంతమంది సెలక్ట్‌ అయ్యారంటే

ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడింది. తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. మొత్తంగా 15,750 పోస్టులకు నిర్వహించిన ఈ నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి..

TS Police Constable Final Results 2023: తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల.. మొత్తం ఎంతమంది సెలక్ట్‌ అయ్యారంటే
TS Police Constable Final Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 04, 2023 | 10:05 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడింది. తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. మొత్తంగా 15,750 పోస్టులకు నిర్వహించిన ఈ నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి రేపు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనుంది. ఎంపికైన మొత్తం అభ్యర్ధుల్లో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలు అక్టోబర్‌ 5వ తేదీ ఉదయం (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడి చేయనుంది.

ఈ నెల 9 నుంచి 11 వరకు ఎస్‌ఎస్‌సీ జేఈ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌ 1324 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. జేఈ రాత పరీక్షలు అక్టోబర్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధుల రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్ తన ప్రకటనలో తెల్పింది. జూనియర్‌ ఇంజినీర్‌ నియామక ప్రక్రియ పేపర్‌1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), పేపర్‌ 2 (ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా కొనసాగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

తెలంగాణ ఇంటర్‌ 2023-24 ప్రవేశాల గడువు మరోమారు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువును మరోమారు ఇంటర్‌ బోర్డు పొడిగించింది. అక్టోబ‌రు 9వ తేదీ వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే