AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ పండగలాంటి వార్త.. ఐటీఐ కళాశాల ఏర్పాటు..

10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ సజ్జనర్‌ అధికారికంగా ప్రకటించారు. కోర్సుకు సంబంధించిన...

TSRTC: విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ పండగలాంటి వార్త.. ఐటీఐ కళాశాల ఏర్పాటు..
TSRTC
Narender Vaitla
|

Updated on: Oct 05, 2023 | 12:17 PM

Share

ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(టీఎస్ఆర్టీసీ) ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది.

10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ సజ్జనర్‌ అధికారికంగా ప్రకటించారు. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు.

ఈ విషయమై సజ్జనర్‌ మాట్లాడుతూ.. ‘తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థ ప్రారంభించింది. తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చింది. ఆ కళాశాలలో ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నాయ’ని చెప్పుకొచ్చారు.

Rtc Iti

ఇక ఈ కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుందని. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్ ని సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..