RK Roja Fires on Bandaru Comments: ‘బండారూ.. నా క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి నీ అర్హత ఏంటీ?’.. మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్
టీడీపీ నేత బండారు నారాయణ మంత్రి రోజాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. రోజా నటించిన బ్లూఫిల్మ్ వీడియోలు తన వద్ద ఉన్నయని, దగ్గరే ఉండి ప్రోత్సహిస్తున్నారంటూ సీఎం జగన్‌ను కూడా విమర్శించారు. మంత్రి రోజాపై చేసిన వ్యక్తిగత కామెంట్స్ గానూ గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో బండారుపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సోమవారం (అక్టోబర్ 2) ఆయనను అరెస్ట్ చేశారు. లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు బంగారు అరెస్టును ఖండించారు. మీ కుటుంబంలోని మహిళపై ఇలాంటి అభ్యంతరకర ఆరోపణలు చేస్తే..
అమరావతి, అక్టోబర్ 4: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు శరవేగంగా జోరందుకున్నాయి. తనను టార్గెట్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ వ్యక్తి గత జీవితం ఇదీ ఇంటూ బండారు సత్యనారాయణ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మూడు నెలల వ్యవధిలో చంద్రబాబును ఉంచిన అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు మంత్రి రోజాను పంపిస్తానని బండారు నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రోజా ఎక్కడ తగ్గకుండా ధీటుగా స్పందించారు. ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 4) ట్వీట్ చేశారు.
‘పురుషాధిక్య ప్రపంచంలో మహిళగా నాకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి నలభై ఏళ్ల క్రితం కష్టమని భావించాను. స్త్రీ ద్వేషులకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పనిచేశాను. పట్టుదలతో వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నాను. మహిళలు ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత ఎదిగినా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది ఆలోచన ధోరణి మారడం లేదు. నన్ను అసభ్యమైన పదజాలంతో, నిరాధారమైన అరోపణలతో కించపరిచారు. ఇలాంటి వ్యక్తులకు మద్ధతిస్తారా అని అన్ని నేషనల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాను. పబ్లిక్ లైఫ్‌లో లేదా పనిచేసే చోట ఏ మహిళా ప్రశ్నార్థకమైన క్యారెక్టర్ కలిగి ఉండదు. దీనిపై మీరెందుకు మౌనంగా ఉన్నారు? బండారు సత్యనారాయణ వంటి మతోన్మాద వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇలాంటి వాళ్లు మహిళల కలలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.
Forty years ago, I was told that I was working in a cutthroat, male-dominated world and that it would be difficult to make a mark as a woman. I worked tirelessly against entrenched misogynists. Though I faced defeat in two election, I persevered and won as an MLA for two… pic.twitter.com/qLkDFpkiPV
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023
ఇలాంటి వారున్న టీడీపీకి మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు. టీడీపీ అధిష్టానం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఇలాగే వేధిస్తున్నారంటూ’ మంత్రి రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి రోజా చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మంత్రి రోజాపై చేసిన వ్యక్తిగత కామెంట్స్ గానూ గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో బండారుపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు సోమవారం (అక్టోబర్ 2) ఆయనను అరెస్ట్ చేశారు. లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు బండారు అరెస్టును ఖండించారు. మీ కుటుంబంలోని మహిళపై ఇలాంటి అభ్యంతరకర ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా? మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టు చెప్పింది. నా క్యారెక్టర్‌ను జడ్జ్ చేయడానికి మీరెవరంటూ రోజా ధ్వజమెత్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.