Boney Kapoor Interview: పెళ్లికి ముందే నటి శ్రీదేవి ప్రెగ్నెంట్? ఎట్టకేలకు మౌనం వీడిన బోనీ కపూర్..
కుర్రకారు కలలరాణి శ్రీదేవి, బోనీకపూర్‌ను హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఆమె తల్లి కాబోతున్నట్లు కపూర్ కుటుంబం ప్రకటించింది. దీంతో ఈ వార్త అప్పట్లో పెద్ద దుమారం లేపింది. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం దాల్చిందని చాలామంది గుసగుసలాడారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఇంత వరకూ తేలలేదు. తాజాగా దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు చెక్ పెట్టాడు..
పెళ్లికి ముందే గర్భం దాల్చడం బాలీవుడ్‌లో సర్వసాధారణం. నటి అలియా భట్ ఈ ట్రెండ్‌కి ఉదాహరణ. తాజాగా స్వర భాస్కర్ కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ 90వ దశకంలో ఇలాంటి విషయాలు బయటికి రావడం అంత సులభం కాదు. పెళ్లికి ముందు బిడ్డను కనాలంటే కొంత బిడియం ఉండేది. అసలు ఆ ఆలోచన సామాన్యులకు వచ్చేదేకాదు. అప్పట్లో కుర్రకారు కలలరాణి శ్రీదేవి, బోనీకపూర్‌ను హఠాత్తుగా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఆమె తల్లి కాబోతున్నట్లు కపూర్ కుటుంబం ప్రకటించింది. దీంతో ఈ వార్త అప్పట్లో పెద్ద దుమారం లేపింది. పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం దాల్చిందని చాలామంది గుసగుసలాడారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం ఇంత వరకూ తేలలేదు. తాజాగా దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు చెక్ పెట్టాడు. ఈ సందర్భంగా బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ..
‘నా రెండో వివాహం శ్రీతో 1996 మే 2వ తేదీన షిర్డీలో జరిగింది. ఆ తర్వాత ఆ మరుపటి సంవత్సరం జనవరిలో ఆమె గర్భం దాల్చింది. దీంతో మా వివాహం దాచడానికి ఇక వేరేమార్గం లేకపోయింది. మా వివాహ విషయాన్ని జూన్ 2న బహిరంగంగా ప్రకటించాం. అందుకే కొంతమంది మా పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం దాల్చినట్లు పుకార్లు పుట్టించారు. జాన్వి మా పెళ్లికి ముందే జన్మించిందని రూమర్లు పుట్టించారు. కాని అది నిజం కాదు. మాకు మత విశ్వాలపై పూర్తి నమ్మకం ఉంది. నా కుమార్తె జాన్వి, నేను, మా కుంటుంబ ప్రతి మూడు నెలలకోసారి తిరుపతికి వెళ్లుంటాం. నా భార్య శ్రీదేవి తన ప్రతి పుట్టిన రోజుకు తిరుపతికి వచ్చేది. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె చెప్పులు లేకుండా జుహు నుంచి సిద్ధి వినాయక్ వరకు కాలినడకన వచ్చేదని’ చెప్పుకొచ్చారు.
1996లో పెళ్లి తర్వాత దేవ్ శ్రీదేవి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. మరొక కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. బోనీ కపూర్‌కు తొలుత మోనా కపూర్‌తో వివాహం జరిగింది. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నటి శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు జారిపడి మరణించారు. కుటుంబమంతా బంధువుల వివాహ వేడుకకు దుబాయ్‌లో ఉండగా శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.