AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్లుగా ఆలయ సేవకుడిగా సేవలు.. అదును చూసి స్వామివారి నగలు, కలశం చోరీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. జిల్లాలోని కలెక్టర్‌గంజ్‌లో ఉన్న జైన దేవాలయంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఓ సేవకుడు ఇద్దరు సహచరుల సాయంతో దేవుడి విగ్రహానికి అలంకరించిన ఏడున్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఘటనకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న..

12 ఏళ్లుగా ఆలయ సేవకుడిగా సేవలు.. అదును చూసి స్వామివారి నగలు, కలశం చోరీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Thieves Steal Silver Ornaments From Temple
Srilakshmi C
|

Updated on: Oct 02, 2023 | 5:01 PM

Share

కాన్పూర్‌, అక్టోబర్‌ 2: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. జిల్లాలోని కలెక్టర్‌గంజ్‌లో ఉన్న జైన దేవాలయంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఓ సేవకుడు ఇద్దరు సహచరుల సాయంతో దేవుడి విగ్రహానికి అలంకరించిన ఏడున్నర కిలోల వెండి ఆభరణాలను అపహరించాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఘటనకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందానికి ఈస్ట్ డీసీపీ రివార్డు ప్రకటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కలెక్టర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సిర్కి మొహల్‌లోని జైన శ్వేతాంబర్ ఆలయంలో సెప్టెంబర్ 29న ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చోరీ ఘటనపై ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆలయంలో దేవుడి విగ్రహానికి అలంకరించిన దాదాపు రూ.6 లక్షల విలువైన వెండి ఆభరణాలు, కలశాన్ని దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గుడిలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీనిలో భాగంగా పోలీసులు దాదాపు 70 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత దొంగలను గుర్తించారు.

నిందితులను గోరఖ్‌పూర్ జిల్లా సిక్రిగంజ్ ఇందిరాపార్ నివాసి దులారే ధోబి అలియాస్ శ్యాము, అసోజీ బజార్‌కు చెందిన దిలీప్ కుమార్, మహొయికి చెందిన రాంవృక్ష్ వర్మలుగా పోలీసులు గుర్తించారు. నిఘానేత్రాల సహాయంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్టు చేశారు. ఝకర్కటి బస్టాండ్‌లో నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన ఏడున్నర కిలోల వెండి ఆభరణాలు, పాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

చోరీ ప్రధాన సూత్రధారి అతనే..

ఆలయంలో జరిగిన చోరీలో షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే.. గత 12 ఏళ్లుగా ఆలయంలో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోన్న దులారే ధోబి అలియాస్ శ్యామూ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా తేలింది. చోరీ ఘటనలో ఆలయ సేవకుడే ప్రధాన నిందితుడని, అతని సహచరులతో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు ఏసీపీ నిశాంక్ శర్మ తెలిపారు. నిందితుడు శ్యాము దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉండేవాడు. జైన శ్వేతాంబర్ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను 50 గంటల్లో ఛేదించిన పోలీసు బృందానికి ప్రభుత్వం రివార్డు అందజేసి సత్కరించింది. ఈ ఘటనను బయటపెట్టిన బృందానికి రూ.25,000 రివార్డు ఇచ్చినట్లు తూర్పు డీసీపీ శివాజీ శుక్లా మీడియాకు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే