Gandhi Jayanti 2023: పాకిస్తానీయుల దృష్టిలో మహాత్మా గాంధీ అంటే ఎవరు.. హీరోనా.. విలనా..

ఇది కూడా నిజం.. జిన్నా, గాంధీ రాజకీయ జీవితం ఒకే సమయంలో ప్రారంభమైంది. ఇద్దరూ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టాలనుకున్నారు. ఇద్దరి లక్ష్యం స్వేచ్ఛ.. ప్రారంభంలో జిన్నా హిందూ-ముస్లిం ఐక్యతకు బలమైన న్యాయవాది. గాంధీ, జిన్నా మధ్య దూరం తరువాత పెరిగింది. గాంధీ కంటే ముందే జిన్నా కాంగ్రెస్‌లో చేరారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు గాంధీ పట్ల  ఓ రకమైన ద్వేష భావాన్ని కలిగి ఉంటారు. గాంధీ పట్ల పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్నంత ద్వేషం ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చు.

Gandhi Jayanti 2023: పాకిస్తానీయుల దృష్టిలో మహాత్మా గాంధీ అంటే ఎవరు.. హీరోనా.. విలనా..
Gandhi Jinnah First Met
Follow us

|

Updated on: Oct 02, 2023 | 5:26 PM

పాకిస్తాన్ ప్రభుత్వాలు మహాత్మా గాంధీని ఎప్పుడూ విలన్‌గా భావించేవి.. కానీ పాకిస్థాన్‌లోని చాలా మంది ప్రజలు దీనికి వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రాణా అలీ హసన్ చౌహాన్ పాకిస్థాన్ చరిత్రకారుడు. గాంధీని అత్యంత గౌరవంగా స్మరించుకునే వారు. అతను గాంధీకి మాత్రమే కాకుండా మహారాణా ప్రతాప్, వాసుదేవ్ కృష్ణ, అయోధ్య చక్రవర్తి శ్రీ రామచంద్ర ప్రభువులవారిని  కూడా ఇలాంటి గౌరవాన్ని వ్యక్తం చేశాడు ఆయన.

ఈ నేపథ్యంలో ఆయన హిస్టరీ ఆఫ్ గుర్జర్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఈ ప్రముఖులను తన పూర్వీకులుగా అభివర్ణించారు రాణా అలీ హసన్ చౌహాన్. పాకిస్తాన్ పాఠ్య పుస్తకాలలో.. గాంధీని ఖచ్చితంగా తెలివైన వ్యక్తిగా వర్ణించారు. కానీ అక్కడి ప్రజల మనసులో గాంధీ కీర్తి చాలా మహోన్నతంగా ఉండేది. సింధ్ ప్రావిన్స్ ప్రజలు అతనిని తమ సొంత వ్యక్తిగా భావిస్తారు. ఎందుకంటే గాంధీ ఉన్న పోర్ బందర్ ప్రాంతం సౌరాష్ట్ర ప్రాంతంలోకి వస్తుంది. కచ్ అనేది సౌరాష్ట్ర పొడిగింపుగా ఉంటుంది. ఇది సింధ్ వరకు విస్తరించి ఉంది.

అలాంటి ద్వేషం ఎక్కడా..

కచ్చి, సౌరాష్ట్ర సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆహారం, దుస్తులు ఒకేలా ఉంటాయి. అందుకే గాంధీజీ మరే ఇతర భారతీయ నాయకుడి కంటే వారికి సన్నిహితంగా కనిపిస్తారు. బలూచిస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి. కానీ పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు గాంధీ పట్ల  ఓ రకమైన ద్వేష భావాన్ని కలిగి ఉంటారు. గాంధీ పట్ల పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉన్నంత ద్వేషం ప్రపంచంలో మరెక్కడా ఉండకపోవచ్చు. అంతలా ఎందుకు వారికి గాంధీ అంటే ద్వేషమో మనం ఇక్కడ తెలుసుకుందాం..

బహుశా దీనికి కారణం దేశవిభజన సమయంలో ఇక్కడే ఎక్కువ రక్తపాతం జరగడం. పాకిస్థాన్‌ను పాలించిన పాలకులు ఎక్కువ మంది పంజాబ్‌కు చెందినవారే కావడం. అందుకే, పంజాబ్‌లో గాంధీ హిందువు అని.. కానీ పాక్ పాలకులు గాంధీని ఎంత తిట్టినా.. విలన్‌గా పిలిచినా.. ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం తగ్గించలేరు. ఇవాళ పాకిస్తాన్ చరిత్రకారులు గాంధీని మొత్తం భారత ఉపఖండానికి వారసత్వం అని నమ్ముతున్నారు.

మతం పునాదులపై పాకిస్థాన్ నిలబడింది..

పాకిస్తాన్ సమస్య ఏంటంటే.. అది మతం ఆధారంగా ఏర్పడిన దేశం. కానీ మతం అనేది కేవలం కపటత్వం, అది ప్రజలను ఏకం చేయదు అనేది అసలు నిజం. మీరు సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి గురించి ఎంత ప్రబోధించినా, పాకిస్థాన్‌లో అనేక ముస్లిం వర్గాలకు వేర్వేరు మసీదులు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. ప్రార్థన మందిరాలు ముస్లింలలోని తెగలు, కులాల వారిగా విడిపోయి ప్రార్థనలు నిర్వహిస్తుంటారు.

అక్కడి ప్రజలను ఏకం చేసేది వారి భాష, సంస్కృతి, ఆహారం, దుస్తులు మాత్రమే.. 1971లో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్థాన్ విడిపోవడానికి కూడా ఇదే పెద్ద కారణం. తూర్పు పాకిస్తాన్ దాని ప్రారంభం నుంచి భారతదేశంలోని బెంగాల్‌కు దగ్గరగా ఉంది. ఈ సాన్నిహిత్యం పాకిస్తానీ పంజాబ్, భారత పంజాబ్ మధ్య కొనసాగింది. కానీ పాకిస్తాన్ ప్రణాళికా దారులు చాలా స్పష్టంగా ఈ రెండు పంజాబ్‌ల ప్రజల మధ్య అగాధాన్ని ఇప్పటికీ సృష్టిస్తూనే ఉన్నారు.

గాంధీని విలన్‌గా చేయడం లేదా భారతీయ పంజాబ్‌లో హిందువులు, సిక్కుల మధ్య చీలికను సృష్టించడం వారి అలవాటు కావచ్చు.

జిన్నా దృష్టిలో జాతిపిత ఎవరంటే..

పాకిస్తాన్ తన శత్రువుగా, ఖండంలోని విలన్‌గా భావించే మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మరణంపై, పాకిస్తాన్ ఏర్పాటుకు కారణంగా మారిన క్వాయిద్-ఎ-ఆజం మొహమ్మద్ అలీ జిన్నా మాట్లాడుతూ.. గాంధీని చంపడం అత్యంత పిరికి చర్యగా జిన్నా అభివర్ణించాడు. ఈ దాడిలో గాంధీ మరణించాడు.. కానీ మన రాజకీయ దృక్పథంలో వ్యతిరేకత ఏదయినా ఉన్నా.. హిందూ సమాజంలో జన్మించిన గొప్ప వ్యక్తులలో ఆయన ఒకరు. నేను చాలా బాధగా ఉన్నాను. నేను హిందూ సమాజానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాంధీ హత్యతో భారతదేశానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అంటూ తెలిపారు.

ద్వేషానికి జిన్నా కారణమా?

ఇది కూడా ఓ నిజం.. జిన్నా, గాంధీ రాజకీయ జీవితం ఒకే సమయంలో ప్రారంభమైంది. ఇద్దరూ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టాలనుకున్నారు. ఇద్దరి లక్ష్యం స్వేచ్ఛ. ప్రారంభంలో జిన్నా హిందూ-ముస్లిం ఐక్యతకు బలమైన న్యాయవాది అని చెప్పవచ్చు.

గాంధీ, జిన్నా మధ్య దూరం తరువాత పెరుగుతూ పోయింది. గాంధీ కంటే ముందే జిన్నా కాంగ్రెస్‌లో చేరారు. 1896లో కాంగ్రెస్‌లో చేరారు. 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. అయితే ప్రత్యేక ముస్లిం దేశంగా  ఏర్పడటాన్ని మొదట్లో జిన్నా చాలా వ్యతిరేకించాడు. కానీ 1913లో ముస్లిం లీగ్‌లో చేరాడు జిన్నా. కానీ అతను ముస్లింలను లేదా హిందువులను ప్రత్యేక దేశాలుగా  ఉండాలని కోరుకోలేదు. 1915లో గాంధీ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత గాంధీని స్వాగతించడానికి బొంబాయిలోని గుర్జార్ సంఘం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జిన్నా అధ్యక్షుడిగా ఉన్నారు.

అయితే ఇంగ్లీషు బట్టలు వేసుకుని ఇంగ్లీషు మాట్లాడే ఈ లాయర్ జిన్నా అంటే గాంధీకి నచ్చలేదు. అదే సంవత్సరం లక్నోలో జరిగిన లీగ్, కాంగ్రెస్ సంయుక్త సమావేశానికి జిన్నా ఆర్గనైజర్‌గా వ్యవహరించాడు. అందువల్ల, పాకిస్తాన్‌లో అభివృద్ధి చెందిన గాంధీ వ్యతిరేకత గాలి జిన్నా అని చెప్పడం మాత్రం తప్పు అని చెప్పవచ్చు.

అమెరికా, కెనడా వంటి దేశాలతో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఉండాలని జిన్నా కోరుకున్నారు. తద్వారా 9000 కి.మీ సరిహద్దును పంచుకునే రెండు దేశాల మధ్య వాణిజ్య, సామాజిక సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. “ది యునైటెడ్ స్టేట్స్ అండ్ పాకిస్థాన్..” డిసెంచన్టెడ్ అలయన్స్ రచయిత కుక్స్, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కరాచీలోని బీచ్‌లో నడుస్తున్నప్పుడు జిన్నా యుఎస్ రాయబారి పాల్ అల్లింగ్‌కు ఈ విషయాన్ని సూచించారని ఆ పుస్తకంలో రాశారు. అలింగ్ అప్పుడు జిన్నాతో ‘అమెరికా భారత్- పాకిస్థాన్‌లను స్నేహపూర్వక పొరుగు దేశాలుగా చూడాలనుకుంటోంది’ అని అన్నారు.

మరణంలో 8 నెలల తేడాలో

అంతర్గత జ్ఞాపకాల ఆధారంగా రూపొందించిన ఈ పుస్తకంలో.. జిన్నా “ఇంకేమీ కోరుకోలేదు” అని ప్రతిస్పందించాడని, అతను దానిని హృదయపూర్వకంగా చెప్పాడని కుక్స్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. డాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిన్నా కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

కానీ దురదృష్టవశాత్తు.. గాంధీ 30 జనవరి 1948న హత్య చేయబడ్డారు.. ఎనిమిది నెలల తర్వాత అంటే 11 సెప్టెంబర్ 1948న జిన్నా మరణించారు. రెండు రోజుల తర్వాత.. 13 సెప్టెంబర్ 1948న.. ది హిందూ వార్తాపత్రికలో ‘మిస్టర్ జిన్నా’ అనే శీర్షికతో సంపాదకీయం ప్రచురించబడింది. ఇందులో గాంధీజీ తర్వాత అవిభక్త భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. సంపాదకీయం కూడా ఇలా పేర్కొంది. “అతనికి చేదుగా ఉన్నప్పటికీ, మిస్టర్ జిన్నా రెండు దేశాల (పాకిస్తాన్-భారతదేశం) మధ్య బలమైన స్నేహం సాధ్యమే కాదు. అవసరమని కూడా మరచిపోలేదు.

Muhammad Ali Jinnah

జిన్నా హిందూ వ్యతిరేకి కాదు, భారతదేశానికి వ్యతిరేకం కాదు..

ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సలహాదారుగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి.. రాసిన తన పుస్తకంలో ఈ వివరాలను వెల్లడించారు. జిన్నా ‘హిందూ వ్యతిరేకి’ లేదా ‘భారత వ్యతిరేకి’ కాదని రాశారు. 1948లో.. అప్పటి తూర్పు పాకిస్తాన్ రాజధాని ఢాకాను సందర్శించిన జిన్నా హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూవులు భయపడకండి, పాకిస్తాన్‌ను విడిచిపెట్టవద్దు.. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజాస్వామ్య రాజ్యంగానే ఉంటుంది.ముస్లింలు.. హిందువులకు  ఒకే హక్కులు లభిస్తాయి’ అని హామీ ఇచ్చారు.

అలాంటప్పుడు పాకిస్థాన్‌లో గాంధీ విలన్‌గా ఎలా మారారు..? సమాధానం ఏంటంటే, పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే జిన్నా మరణించాడు. మొదట ప్రధాని లియాఖత్ అలీ హత్య.. దీని తరువాత దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుని అధికారంలోకి వచ్చింది. ఇది అక్కడ ప్రజాస్వామ్య సూత్రాలను నిట్టనిలువున చంపేసింది. జిన్నాప్రతిపాధించిన ప్రజాస్వామ్యాన్ని కూడా హత్య చేసింది అధికారంలోకి వచ్చిన మిలటరీ ప్రభుత్వం. అక్కడి ప్రజలలో భారతదేశాన్ని శత్రుదేశంగా నూరిపోసింది. దీని ఫలితమే నేటి పాకిస్థాన్.

పాకిస్థాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరంగా ఉంచేందుకు.. పాక్ సైన్యం మతపరమైన మతోన్మాదాన్ని వ్యాప్తి చేసింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇప్పటి వరకు విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శ రాజకీయ నాయకుడిగా పేరొందిన గాంధీ పాకిస్థాన్ లో విలన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి