AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annamalai: వివాదంలో ఇరుక్కున్న అన్నమలై.. మహిళా విలేకరిపై అభ్యంతకర వ్యాఖ్యలు

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనను ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నించంగా.. ఆమె పట్ల అన్నామలై ప్రవర్తించిన తీరు ప్రస్తతం వివాదాస్పదంగా మారిపోయింది. దీనివల్ల ప్రతిపక్ష నేతలతో సహా జర్నలిస్టులు కూడా ఆయన తీరును తప్పుబట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మీరు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయి ఉంటే.. ఆ పార్టీలోనే కొనసాగేవారా అని ఓ మహిళా విలేకరి అన్నమలైని ప్రశ్నించారు.

Annamalai: వివాదంలో ఇరుక్కున్న అన్నమలై.. మహిళా విలేకరిపై అభ్యంతకర వ్యాఖ్యలు
Annamalai
Aravind B
|

Updated on: Oct 02, 2023 | 5:14 PM

Share

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనను ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నించంగా.. ఆమె పట్ల అన్నామలై ప్రవర్తించిన తీరు ప్రస్తతం వివాదాస్పదంగా మారిపోయింది. దీనివల్ల ప్రతిపక్ష నేతలతో సహా జర్నలిస్టులు కూడా ఆయన తీరును తప్పుబట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మీరు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాకపోయి ఉంటే.. ఆ పార్టీలోనే కొనసాగేవారా అని ఓ మహిళా విలేకరి అన్నమలైని ప్రశ్నించారు. దీంతో ఆయన ఈ ప్రశ్నపై తీవ్రంగా స్పందించారు. ఆమెను ముందుకు వచ్చి తన పక్కనే నిలబడాలని అన్నారు. అప్పుడు ఈ ప్రశ్న అడిగిన వ్యక్తిని అందరూ చూస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్న అడిగిన వారెవరో వచ్చి నా పక్కన నిలబడండి. ఎందుకంటే.. ఇంతటి అద్భుతమైన ప్రశ్నను అడిగిన వారెవరో ఎనిమిది కోట్ల మంది ప్రజలు సైతం తెలుసుకోవాలి కదా అని అన్నారు.

అలాగే ప్రశ్నలు అడిగడానికి కూడా ఒక మార్గం అనేది ఉంటుందని హితవు పలికారు. ఆ తర్వాత ఆ మహిళా జర్నలిస్టు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడారు. తాను పూర్తిగా రాజకీయ నాయకుడిని కాదని.. అంతకుముందు రైతునని చెప్పారు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడ్ని అయ్యానని పేర్కొన్నారు. అలాగే ఆ తర్వాతే బీజేపీతో కలిసి ఉన్నానని వ్యాఖ్యానించారు. అలాగే సరైన మార్గంలో ప్రశ్నలు అడగాలని ఆ మహిళ జర్నలిస్టుకు సూచిస్తూ అన్నామలై వివరణను ఇచ్చారు. అయితే అన్నామలై ప్రవర్తించిన తీరుపై కోయంబత్తూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఘాటుగా తమ స్పందనను తెలియజేసింది. అసలు పాత్రికేయులకు జర్నలిజంలో ఉన్న విలువలను బోధించడానికి ముందు.. మీరు నాయకుడికి ఉండాల్సిన తీరును నేర్చుకోవాలని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఏఆర్‌ బాబు అన్నమలైపై విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా మరోవైపు.. అన్నామలై మహిళా జర్నలిస్టుతో ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ లక్ష్మీ రామచంద్రన్‌ కూడా స్పందించారు. ఇందుకు సంబంధించి ట్విటర్‌ వేదికగా స్పందించారు. తాను ఇలాంటి అహంకారాన్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడిలోనూ చూడలేదని పేర్కొన్నారు. మానవాళికి అన్నామలైను దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నారా..? అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఇటీవలే తమిళనాడులోని బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన సంగతి అందరికీ తెలిసింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన అన్నమలై.. పెరియర్ రామస్వామి, అన్నదొరై, జయలలితలపై విమర్శలు చేయడంతో ఏఐడీఎంకే ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. చివరికి బీజేపీ నుంచి తమ బంధాన్ని తెంచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..