ఏం ఐడియా గురూ..! పాత సెల్ ఫోన్లకు కోడి పిల్లలు విక్రయిస్తోన్న వ్యాపారి..
పాత పేపర్లు, ప్లాస్టిక్-ఇనుప సామగ్రికి ఉల్లిపాయలు, డబ్బులు ఇవ్వడం మనం చాలా ఎన్నోసార్లు చూశాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా పాత సెల్ ఫోన్లకు కోడి పిల్లలను అమ్మడం మొదలు పెట్టాడు. అదేంటీ అని అనుకుంటున్నారా? స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాక ప్రతి ఇంట్లో పనికిరాని, చెడిపోయిన సెల్ ఫోన్లు వృధాగా పడి ఉంటున్నాయి. వాటిని కొనుగోలు చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించడం, కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న సదరు యువకుడు ఇంటింటికి వెళ్లి పాత సెల్‌ఫోన్‌లను తీసుకుని కొడిపల్లలను
చెన్నై, అక్టోబర్ 1: పాత పేపర్లు, ప్లాస్టిక్-ఇనుప సామగ్రికి ఉల్లిపాయలు, డబ్బులు ఇవ్వడం మనం చాలా ఎన్నోసార్లు చూశాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా పాత సెల్ ఫోన్లకు కోడి పిల్లలను అమ్మడం మొదలు పెట్టాడు. అదేంటీ అని అనుకుంటున్నారా? స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాక ప్రతి ఇంట్లో పనికిరాని, చెడిపోయిన సెల్ ఫోన్లు వృధాగా పడి ఉంటున్నాయి. వాటిని కొనుగోలు చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించడం, కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న సదరు యువకుడు ఇంటింటికి వెళ్లి పాత సెల్‌ఫోన్‌లను తీసుకుని కొడిపల్లలను అందిస్తున్నాడు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన అన్బళగన్ అనే వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించడం, కాలుష్యం బారి నుంచి పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న అన్బళగన్ దీనిలో భాగంగా పాత సెల్‌ఫోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే పాత సెల్ ఫోన్లను తీసుకుని ఉల్లి లేదంటే డబ్బు ఇస్తే పరిపోతుందిలే అని అతను అనుకోలేదు. కొన్న సెల్‌ఫోన్లను రీ సైక్లింగ్ చేసేందుకు వివిధ సెల్‌ఫోన్ సంస్థలతో చర్చలు జరిపాడు. ఆయా సంస్థల నుంచి గ్నీన్ సిగ్నల్ రావడంతో తన కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చాడు. తెన్‌కాశి, మదురై, తూత్తుకుడి, విరుదునగర్ తదితర ప్రాంతాల్లో వినూత్నరీతిలో సెల్‌ఫోన్లు కొనుగోలు చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశాడు.
పనికిరాని పాత బటన్ సెల్‌ఫోన్లు ఇచ్చిన వారికి 2 కోడి పిల్లలు.. ఇక ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ ఫోన్ ఇచ్చిన వారికి 4 కోడి పిల్లలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం మొత్తం 50 మందిని రంగంలోకి దింపి తన వినూత్న వ్యాపారానికి వినియోగించు కుంటున్నాడు. కోడిపిల్లల బుట్టల్లో పెట్టుకుని సైకిల్ లేదా బైక్‌పై వీధివీధికి వెళ్లి పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నామక్కల్ ప్రాంతంలో వందలాది కోడి పిల్లలు ప్రజలు కొనుగోలు చేస్తున్నట్లు అన్బళగన్ మీడియాకు వివరించారు. అన్బళగన్ మాదిరి అందరూ ప్లాస్టిక్ వినియోగంపై కాస్త శ్రద్ధ చూపితే పర్యావరణ పరిరక్షణ కష్టమేమీ కాదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.