Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. డ్రైనేజీలో జారిపడి మహిళా కానిస్టేబుల్‌ మృతి!

ఖమ్మం జిల్లా సారథినగర్‌కు చెందిన రూపన శ్రీదేవి (49) కొత్తగూడెంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తాజాగా భద్రాచలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి బందోబస్తుకు వెళ్లారు. ఆలయ అన్నదాన సత్రం వద్ద హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి విధులకు హాజరయ్యారు. అక్కడ శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో మంత్రి కేటీఆర్‌.. .

Telangana: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. డ్రైనేజీలో జారిపడి మహిళా కానిస్టేబుల్‌ మృతి!
Constable Sridevi
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 01, 2023 | 8:44 AM

కొత్తగూడెం, అక్టోబర్‌ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లిన ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ పొరపాటున డ్రైనేజీలో పది గల్లంతైంది. భారీ వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోన్న డ్రైనేజిలో మహిళా కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తు పడిపోయారు. అనంతరం ఆమె నాలా నీళ్లలో గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం (సెప్టెంబర్ 30) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా సారథినగర్‌కు చెందిన రూపన శ్రీదేవి (49) కొత్తగూడెంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తాజాగా భద్రాచలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి బందోబస్తుకు వెళ్లారు. ఆలయ అన్నదాన సత్రం వద్ద హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి విధులకు హాజరయ్యారు. అక్కడ శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో మంత్రి కేటీఆర్‌ పర్యటన రద్దయ్యింది. దీంతో పక్కనే ఉన్న సత్రంలోకి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం దగ్గర ఉన్న మురుగు కాలువలో జారిపడ్డారు. అదే సమయంలో అక్కడ ఉన్న పంచాయతీ కార్మికుడు సునీల్‌ ఆమె చేయి పట్టుకుని బయటకులాగే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. వర్షం నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. నీటి ధాటికి ఆమె కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయారు.

అనంతరం సమీప గోదావరి కరకట్ట స్లూయిస్‌ల వద్ద శ్రీదేవి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయంతో శ్రీదేవి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతిచెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీదేవి 1995వ బ్యాచ్‌కు చెందిన వారు. ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. ఆమె భర్త రామారావు జిల్లా కేంద్రంలో స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి కేటీఆర్‌ బందోబస్తు విధులకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ మృత్యువాత పడటం స్థానికంగా చర్చణీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.