PM Modi: మహబూబ్‌నగర్‌కు ప్రధాని మోదీ.. పార్కింగ్, ట్రాఫిక్‌పై కీలక సూచనలు చేసిన పోలీసులు..
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ కె నరసింహ. ప్రధాన పర్యటన నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి బందోబస్త్ కోసం పోలీసు సిబ్బంది వస్తున్నారని తెలిపారు.

PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాని భద్రతా ఏర్పాట్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ కె నరసింహ. ప్రధాన పర్యటన నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి బందోబస్త్ కోసం పోలీసు సిబ్బంది వస్తున్నారని తెలిపారు.
ప్రధాని భద్రత కోసం..
7 – SP క్యాడర్ అధికారులు 8 – Addl SP క్యాడర్ అధికారులు 18 – DSP క్యాడర్ అధికారులు 55 – CI/RI క్యాడర్ అధికారులు 170 – SI/RSI క్యాడర్ అధికారులు 1,640 – ASI/HC/PC/hg.. క్యాడర్ అధికారులు
ప్రధానమంత్రి వచ్చి పోయేంతవరకూ ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలో అందరికీ భద్రతా పరమైన సూచనలు వివరించారు. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. వచ్చిన ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రధానమంత్రి పర్యటన సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు..
1. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మహబూబ్‌నగర్ టౌన్ నుంచి భూత్పూర్ వైపు భారీ వాహనాలకు అమనుతి లేదు. మీటింగ్‌కు వచ్చే వాహనాలకు మాత్రమే సాక్షి గణపతి టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలి.
2. హైదరాబాద్, జడ్చర్ల వైపు నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు భూత్పుర్ ఫ్లైఓవర్ ప్రారంభంలో గల కేవీఎన్ ఫంక్షన్ హాల్ పక్కన వున్న ఖాళీ స్థలంలో మాత్రమే పార్కింగ్ చేయాలి.
3. నాగర్ కర్నూలు వైపు నుండి మీటింగ్ కు వచ్చే వాహనాలు కరువేన గేటు దగ్గర గల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.
4. గద్వాల్, కర్నూల్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే వాహనాలు హైవే మీద గల టాటా మోటార్స్ వెనకాల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.
5. మహబూబ్‌నగర్ పట్టణం నుండి వచ్చే వాహనాలు బూత్పూర్ రోడ్డు మీదుగా అనుమతి లేదు. జడ్చర్ల హైవే మీదుగా హైదరాబాద్, కర్నూల్ వైపు టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.
6. రాయచూరు, తాండూర్ వెళ్లవలసిన వాహనాలు జడ్చర్ల దగ్గర ఫ్లైఓవర్ దిగి మహబూబ్‌నగర్ పట్టణం నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
7. మిడ్జిల్, కల్వకూర్తి, నల్గొండ వైపు నుండి, రాజాపూర్, బాలానగర్, షాద్ నగర్, హైదరాబాద్ వైపు నుండి వచ్చే మోటార్ వాహనదారులకు పోలీసులు ఈ సూచనలు చేశారు.
ఇక ఆదివారం నాడు భూత్పూర్ ఐటీఐ గ్రౌండ్స్‌లో జరుగబోయే ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యే వారు తమ వాహనాలను జడ్చర్ల వద్ద ఉన్న ఫ్లై ఓవర్ కింద నుంచి తమ వాహనాలను మలుపుకొని మహబూబ్‌నగర్ వైపు ఉన్న పిస్తా హౌస్ మీదుగా, బైపాస్ రోడ్ నెం 167 జాతీయ రహదారి ద్వారా కొత్త కలెక్టరేట్ కార్యాలయం నుంచి త్వరగా చేసుకోవచ్చునని పోలీసులు తెలిపారు. తద్వారా ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..