AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్ష సూచన.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది. వీటి కారణంగా వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్ష సూచన.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌
అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.
Surya Kala
|

Updated on: Oct 01, 2023 | 8:10 AM

Share

గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. హఠాత్తుగా మేఘాలు ఏర్పడి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వాతావరణ మార్పుకు కారణం  శుక్రవారం ఈశాన్య, తూర్పు , మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంమని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని.. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని తెలిపింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది.

వీటి కారణంగా వచ్చే మూడురోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా శనివారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.

సముద్రం మేఘాలతో కప్పబడి ఉందని.. దీంతో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈసారి కురుస్తున్న వర్షాలతో ఉరుములు, మెరుపులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..