Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నేటి నుంచి నాలుగో విడత పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర.. టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసినడవాలని లోకేష్ పిలుపు..

కృష్ణాజిల్లాలో చేపడతున్న పవన్‌ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి వారాహి యాత్రకు ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు. పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

Pawan Kalyan: నేటి నుంచి నాలుగో విడత పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర.. టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసినడవాలని లోకేష్ పిలుపు..
Pawan Varahi Yatra
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2023 | 7:42 AM

నాలుగో విడత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభకానుంది. అవనిగడ్డలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది జనసేన. పొత్తుల తర్వాత జరుగుతున్న వారాహియాత్ర కావడం.. యాత్రకు టీడీపీ మద్దతు తెలపడంతో పవన్‌ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి జనసేనపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభంకానుంది. కృష్ణా జిల్లాలో 5రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది. ఇవాళ అవనిగడ్డనుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారు పవన్ కళ్యాణ్. అవనిగడ్డలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ డిగ్రి కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు పవన్. ఇప్పటికే జిల్లా నేతలు, కార్యకర్తలు వారాహి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

యాత్రలో భాగంగా ప్రభుత్వం తీరుపై ప్రజలకు వివరించడమే కాదు.. ప్రజల సమస్యలను స్వయంగా జనసేనాని అడిగి తెలుసుకోనున్నారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అంతేకాదు జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. చేనేత కార్మికులను, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారితో సమావేశమవుతారు. వారికి భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. 4వ తేదీన పెడనలో.. 5వ తేదీన కైకలూరులో వారాహి యాత్రను కొనసాగిస్తారు పవన్‌. కృష్ణాజిల్లాలో చేపడతున్న పవన్‌ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి వారాహి యాత్రకు ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.

పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని ఆదేశించారు లోకేష్. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి వైసీపీ అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు లోకేష్.

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. అలాగే టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర, మరోవైపు వారాహి యాత్రకు టీడీపీ సపోర్ట్‌ చేయడం.. ఇవన్ని పరిణామాల తర్వాత ఇవాళ్టి పవన్‌ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..